twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారంతా అలాంటి వారే.. నగ్నసత్యాలు చెప్పిన నాగబాబు

    |

    మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూట్ చానెల్‌లో తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. ఇమేజ్ ఛట్రం, అందులో ఇరుక్కుపోయిన ఎలాంటి కష్టాలు పడతారు, అది ఎంత ప్రమాదకరమో చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా పురాణాల నుంచి మోడ్రన్ ప్రపంచం వరకు అందరి గురించి పేర్కొన్నాడు. ఈ క్రమంలో సత్య హరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, ధర్మరాజు, కర్ణుడు, శ్రీరాముడి గురించి చెప్పుకొచ్చాడు. సమాజంలోనూ చాలా మంది ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోయి వారి వారి జీవితాలను వదలేసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు.

    ఇమేజ్ కోసం...

    ఇమేజ్ కోసం...

    ఆడిన మాట తప్పడు అనే ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోయిన సత్య హరిశ్చంద్రుడు, శిబి, బలి, కర్ణుడు కథ ఎలా ముగిసిందో నాగబాబు వివరించాడు. మాట కోసం రాజ్యాన్ని, భార్యాపిల్లలను వదులుకున్నాడని, శిబ తన తొడను కోసి ఇచ్చాడని, బలి మూడు అడుగుల కోసం ప్రాణాలను వదిలాడని చెప్పుకొచ్చాడు. ఇచ్చిన మాట కోసం అంతలా చేయాల్సిన అవసరం లేదని మాట నిలుపుకోవడానికి చేతనైన ప్రయత్నం చేయాలని, వీలు కాకపోతే వదిలేయవచ్చని తెలిపాడు. దాని కోసం ప్రాణాలను వదిలిపెట్టాల్సిన పని లేదన్నాడు.

    వీలైనంత సాయం..

    వీలైనంత సాయం..

    ఎవ్వరైనా సరే వీలైన సాయం చేయాలని, అంతే కాని లేకపోయినా చేయాల్సిన పని లేదని చెప్పుకొచ్చాడు. ఈ సమాజంలో మంచి ఇమేజ్‌తో బతకడమే చాలా కష్టమని, దానికి బదులు చెడ్డవాడు, దుర్మార్గుడు, నీచుడు వంటి ఇమేజ్‌తో బతకడం చాలా సులభమని, ఎందుకంటే వారి నుంచి సమాజం ఏది ఆశించిదని తెలిపాడు.

    విగ్ పెట్టుకోవాలనే ఆశ లేదు..

    విగ్ పెట్టుకోవాలనే ఆశ లేదు..

    తనకు ఎలాంటి ఇమేజ్ లేదని, అందులో తాను బతకనని నాగబాబు చెప్పుకొచ్చాడు. తనకు ఎలా నచ్చితే అలా బతుకుతానని, షూటింగ్‌ల కోసం విగ్ పెట్టుకుంటానని, ఖాళీ సమయాల్లో మాములుగానే ఉంటానని తెలిపాడు. కానీ కొందరు ఇమేజ్ కోసం అవసరం లేకపోయినా విగ్గులు పెట్టుకుంటారని, దురద పెట్టినా గోక్కోలేరని, అలాంటి ఇమేజ్ అవసరం తనకు లేదన్నాడు. ఈ విషయంలో రజినీకాంత్‌ను కూడా ప్రస్తావించాడు. ఆయన మామూలు సమయంలో విగ్గులు పెట్టుకోడని తెలిపాడు.

    మనిషిలా బతకాలి..

    మనిషిలా బతకాలి..

    ప్రతీ ఒక్కరూ శ్రీ రాముడిలా, కర్ణుడిలా వారిలా వీరిలా బతకాలని కోరుకుంటున్నారని ఎవ్వరూ కూడా మనిషిలా బతకాలని కోరుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. ఇమేజ్ ఛట్రంలో పడిపోయి వారి జీవితాల్ని వారు అనుభవించడం లేదని తెలిపాడు. అబ్దుల్ కలాం, మధర్ థెరిస్సా వంటి వారికి కూడా ఇమేజ్ ఉంది కానీ.. వారు ఆ ఇమేజ్ కోసం బతకలేదని తెలిపాడు. వారు వారికి నచ్చినట్టుగా బతికారని చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    #SarkaruVaariPaata: Kichcha Sudeep To Play Key Role In Mahesh Babu's Movie | Filmibeat Telugu
     చేయగలిగితే చేస్తాను..

    చేయగలిగితే చేస్తాను..

    నాగబాబు మంచోడు, సాయం చేస్తాడని అందరూ వచ్చి తనను అడిగితే.. తాను సాయం చేయనని తెలిపాడు. తనకు చేయాలనిపిస్తే.. చేయగలిగేంత ఉంటేనే చేస్తానని తెలిపాడు. ఇందులో భాగంగా చిత్తూరు నాగయ్య గురించి చెప్పుకొచ్చాడు. ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా.. అప్పు తీసుకుని మరి సాయం చేసేవారట అని తెలిపాడు. ఆయన ఆ బలహీనతను అందరూ వాడుకున్నారని పేర్కొన్నాడు. ఇక నాగబాబు చెప్పిన ఈ మాటలతో కొందరు ఏకీభవిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మరి కొందరు రాను రాను ఆర్జీవీలా తయారవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    Naga Babu About Adolescent Of Self Image. naga babu suggest That Dont stick To Image Live Life As Ur Wish.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X