పవన్ కళ్యాణ్‌ను ఆ పాత్రలో చూడాలనే కోరిక ఉండేది.. మనసులో మాట బయటపెట్టిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే మామూలుగా నాగబాబు తాను చెప్పాలనుకున్నదే చెప్పి సైలెంట్‌గా ఉంటాడు తప్పా.. నెటిజన్లకు రిప్లై ఇవ్వడం గానీ, ఇంటరాక్షన్ అవ్వడం గానీ చేయడు. కానీ తాజాగా ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానమిస్తూ.. తన మనసులోని మాటను బయటపెట్టాడు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ మంచి టీనేజ్‌లో ఉన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దానిపై నాగబాబు కామెంట్ చేశాడు.

మెగా ఫోటోలు..

మెగా ఫోటోలు..

ఆ మధ్య వరల్డ్ ఫోటోగ్రఫీ రోజు నాగబాబు ఓ అద్భుతమైన వీడియో పెట్టాడు. చిరంజీవికి చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ మీదున్న ఆసక్తి గురించి చెబుతూ తమ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతీ మూమెంట్‌ను ఫోటోలో బంధించేవారని, అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారట.

ఫోటోల విలువ..

ఫోటోల విలువ..

కాలాన్ని బంధించగల శక్తి ఫోటోలకు ఉంటుందని, వాటి విలువ ఇప్పుడు తెలీదని ఓ 30, 40 ఏళ్లు తరువాత తెలుస్తుందని అన్నారట. నిజంగానే తామిప్పుడు ఆ ఫోటోలను చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తమ ఇంట్లో ప్రతీ ఒక్కరి ఫోటో ఉందని, అలా కొన్ని ఆల్బమ్స్ ఉన్నాయని ఆ మధ్య చెప్పుకొచ్చాడు. తాజాగా పవన్ కళ్యాణ్ యంగ్ ఫోటోపై కామెంట్ చేశాడు.

ఫోటోపై నాగబాబు కామెంట్

ఫోటోపై నాగబాబు కామెంట్

పవన్ కళ్యాణ్ ఆ ఫోటోలో ఎలా ఉన్నాడో చెప్పడానికి మాటలు, రాయడానికి పదాలు సరిపోవు. ఆ కళ్లు ఎంతో చెబుతున్నాయి.. ఆ సుందర వదనం ఏదో సాధించబోతోన్నట్టు హింట్ ఇస్తున్నాయి.. మొత్తంగా ఆ రూపం ఏదో సంచలనం సృష్టించేందుకు వచ్చిందని అర్థమవుతోంది. ఈ ఫోటోపై నాగబాబు కామెంట్ చేస్తూ ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి.., నా దగ్గర దాచనంతే... ! అని అన్నాడు. ఎప్పటికీ ఓ గొప్ప సోదరుడు.. అచంచంమైన, అనంతమైన ప్రేమ ఉంటుంది అని తెలిపాడు.

Recommended Video

Mega Fans And Super Star Fans Waiting For Gautham & Akira Nandan Entry
ఆ పాత్రలో..

ఆ పాత్రలో..

ఇక నెటిజన్లు ఈ ఫోటోను చూస్తూ.. చేగువేరాలా ఉన్నాడు.. జార్జ్ రెడ్డిలా ఉన్నాడు.. ఒకవేళ ఆ సమయంలో సినిమా తీసి ఉంటేనా అంటూ తమ కోరికలను బయట పెట్టారు అభిమానులు. వాటికి నాగబాబు రిప్లై ఇస్తూ.. నాకున్న కలల్లో అది కూడా ఒకటి.. పవన్ కళ్యాణ్ జార్జ్ రెడ్డి చిత్రాన్ని, పాత్రను చేయాలని ఉండేది అని తెలిపాడు. జార్డ్ రెడ్డి సినిమా విడుదల సమయంలోనూ నాగబాబు ఈ విషయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X