twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీకల్లోతు కష్టాల్లో ఉంటే ఆ ఇద్దరే సపోర్ట్.. వారి రుణం ఎలా అంటూ నాగబాబు ఎమోషనల్

    |

    మెగా బ్రదర్ నాగబాబు మంగళవారం తన జన్మదినాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానెల్‌కు భావోద్వేగంలో మునిగిపోయారు. తనకు జన్మదినం జరుపుకోవడం ఇష్టం లేదు. కానీ డాక్యుమెంటేషన్ కోసం ఈ స్పీచ్‌ను నా కోసం రికార్డు చేసుకొంటున్నాను అని నాగబాబు ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా జీవితంలో సపోర్టుగా నిలిచిన ప్రతీ కుటుంబ సభ్యుడిని పేరు తెలుపుతూ థ్యాంక్స్ చెప్పారు. నాగబాబు చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

     నా జీవితంలో థ్యాంక్స్

    నా జీవితంలో థ్యాంక్స్

    నా జీవితంలో నేను థ్యాంక్స్ చెప్పుకొనే వారిలో నా సోదరి సోదరులు. మా అన్నయ్య చిరంజీవి, ఇద్దరు చెల్లెల్లతో కలిసి పెరిగాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కొండలా సపోర్ట్ చేసిన అన్నదమ్ములకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారిద్దరు చేసిన సహాయానికి నేను థ్యాంక్స్ చెబితే సరిపోదు. వారికి ఏం చేసినా రుణం తీర్చుకోలేను. పీకల్లోతు కష్టాల్లో వారు అండగా నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పి నేను ఆ భారాన్ని దించుకోలేను అని నాగబాబు అన్నారు.

    కష్టాల్లో ఉంటే పట్టించుకొన్న..

    కష్టాల్లో ఉంటే పట్టించుకొన్న..

    అల్లు అరవింద్ నా జీవితంలో కీలకమైన వ్యక్తి. బయట ఆయన గురించి ఏమనుకొన్నా.. నేను పట్టించుకోను. కానీ నా కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన తీసిన నా పేరు సూర్య చిత్రంలో భాగస్వామిగా చేసుకొన్నారు. అందుకు అల్లు అర్జున్ కూడా ముందుకొచ్చారు. వారిద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకొంటాను. అల్లు అర్జున్ స్టార్ ఎదిగిన తర్వాత చాలా మెచ్యురిటీతో వ్యవహరిస్తున్నారు అని నాగబాబు ఎమోషనల్ అయ్యారు.

    పవన్ కల్యాణ్ నాకు అండగా

    పవన్ కల్యాణ్ నాకు అండగా

    నా జీవితంలో ప్రధానంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి పవన్ కల్యాణ్. ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేశారు. ప్రజా సేవ చేయడానికి అవకాశం కల్పించారు. నేను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు అన్నయ్యతోపాటు నా తమ్ముడు కూడా చాలా సపోర్టుగా నిలిచారు. అందుకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారి సపోర్టును ఒక్కమాట చెప్పి రుణం తీర్చుకోలేను అని నాగబాబు పేర్కొన్నారు.

    నా భార్య గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి

    నా జీవితంలో ఓ ఫిల్లర్‌గా నిలిచిన వ్యక్తి నా భార్య పద్మజ . పిల్లల విషయంలో రెస్పాన్సిబులిటీ తీసుకొకుండా ఉంటే ఆమె బాధ్యతగా తీసుకొని వారిని పెంచారు. అమాయకత్వంతో పాటు మంచి వ్యక్తిత్వం ఉన్న భాగస్వామి. నా పిల్లలు స్వయంగా ఎదిగారు. కష్టపడి వారి కాళ్లపై వాళ్లు నిలబడ్డారు. నా సహాయం లేకుండా ఎదిగిన వరుణ్, నిహారికకు థ్యాంక్స్. ఆ సంతోషాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ అని నాగబాబు అన్నారు.

    Recommended Video

    మెగా ఫ్యామిలీ వీడియో..!!
    వరుణ్ నాకు హోదాను కల్పించాడు

    వరుణ్ నాకు హోదాను కల్పించాడు

    వరుణ్ తేజ్ సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు నేను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అయినా తనకు తానుగా కష్టపడి సినిమా ఇండస్ట్రీలో ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నాడు. తాను స్వయంగా ఎదగడమే కాకుండా నాకు హోదాను కల్పించాడు. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిహారిక కూడా అంతే. నా సహాయం కోసం ఎన్నడూ ఎదురు చూడలేదు. వెబ్ సిరీస్‌లో నటిస్తూ ఆర్థికంగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నది అని నాగబాబు అన్నారు.

    English summary
    Mega Brother Naga Babu emotional about Pawan Kalyan and Chiranjeevi on his birthday. He said, They were helped a lot when he was in crisis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X