Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎప్పుడూ ముందుంటావు.. గర్వంగా ఉంది నాన్న.. వరుణ్ తేజ్‌పై నాగబాబు ఎమోషనల్
మెగా డాటర్ నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుకలు కూడా జరిగాయి. నూతన దంపతులు అన్నవరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. మొత్తానికి నిహారిక చైతన్యల పెళ్లి ఘనంగానే జరిగింది. అంతా ఎక్కడి వారు అక్కడికి చేరుకున్నారు.ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. కానీ నిహారిక పెళ్లి వార్తలు, వాటి విశేషాలు మాత్రం సోషల్ మీడియాలో ఇంకా వైరల్అవుతున్నాయి.
Recommended Video
ప్రస్తుతం అందరూ అదే..
అయితే ప్రస్తుతం అందరూ వరుణ్ తేజ్ గురించే మాట్లాడుతున్నారు. నిహారిక పెళ్లి బాధ్యతను మొత్తం తన భుజాలపైనే మోశాడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఏ మాత్రం తీసుకోకుండా సొంతంగానే అన్నీ ప్లాన్ చేశాడు. ఉదయ్ పూర్ ప్యాలెస్ అయినా రిసెప్షన్ ఈవెంట్ అయినా ఇలా ప్రతీ ఒక్కటి వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకున్నాడు.
మూడు రోజుల కార్యక్రమం..
ఉదయ్ పూర్లో ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో మూడు రోజుల పాటు నిహారిక పెళ్లి కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి. సంగీత్ మెహిందీ ఈవెంట్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇలా మూడు రోజుల పాటు అక్కడి ఈవెంట్లు, ఆర్గనైజేషన్ చూసి అందరూ అవాక్కయ్యారు. అదంతా వరుణ్ తేజ్ ప్లానింగ్ అని తెలిసి అందరూ షాక్ అయ్యారట. నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్ అంటూ బన్నీ ఏకంగా ప్రశంసలతో ముంచెత్తాడు.
తాజాగా నాగబాబు..
ఏ
తండ్రికైనా
కొడుకు
చేతికి
అంది
వస్తే
సంతోషంగానే
ఉంటుంది.
మరీ
ముఖ్యంగా
కూతురి
పెళ్లి
బాధ్యతలను
భుజాన
వేసుకుని
కొడుకు
అన్ని
పనులు
చేస్తే
తండ్రికి
పట్టరాని
సంతోషమేస్తుంది.
ఇప్పుడు
నాగబాబు
కూడా
అదే
ఆనందంలో
మునిగితేలుతున్నాడు.
ఎప్పుడూ ముందుంటావు..
ఆశించిన దాని కంటే ఎక్కువగా చేసేందుకు ఎప్పుడూ ముందుంటావు.. నా రెక్కల్లోంచి బయకు వచ్చి.. ఇలా అందరినీ కమాండ్ చేసే స్థాయి వరకు ఎదిగావంటే ఇప్పటికీ నమ్మలేకపోతోన్నాను.. ఈ పెళ్లిని ఇంత ఘనంగా ఎలా జరిపించావ్ నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను.. అడిగిన దాని కంటే ఎక్కువగానే ఇచ్చావ్.. మై డియర్ నాన్న..నిన్ను చూస్తే గర్వంగా ఉంది నాన్న అంటూ వరుణ్ తేజ్ గురించి చెబుతూ నాగబాబు ఎమోషనల్ అయ్యాడు.