Valentines Day: వాలెంటైన్స్ డేకు నాగ చైతన్య సర్‌ప్రైజ్.. బుజ్జి తల్లి అంటూ హీరోయిన్‌తో క్యూట్‌గా!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది సినీ వారసులు పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన టాలెంట్లతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున కుమారుడు యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ విభిన్నమైన చిత్రాలు చేస్తోన్న అతడు.. తన రేంజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న నాగ చైతన్య.. కొద్ది రోజుల క్రితమే 'ధూత' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని ద్వారా తనదైన రీతిలో సత్తా చాటాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు అతడు 'తండేల్' అనే మూవీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వహిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయన్న విషయం తెలిసిందే.

అక్కినేని నాగ చైతన్య - చందూ మొండేటి కలయికలో రూపొందుతోన్న 'తండేల్' మూవీ సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందుతోంది. ఇటీవలే ఈ మూవీ షూట్ మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను జరుపుతూ చాలా వరకూ టాకీ పార్టును పూర్తి చేస్తున్నారు.
'తండేల్' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను కొద్ది రోజుల క్రితమే విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. అదే సమయంలో ఈ వీడియో చివర్లో నాగ చైతన్య, సాయి పల్లవి ఓ సన్నివేశంలో కనిపిస్తారు. దాన్ని చాలా మంది నెటిజన్లు రీల్స్‌లా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అదే తరహాలో హీరో, హీరోయిన్ సర్‌ప్రైజ్ చేశారు.
వాలెంటైన్స్ డేను పురస్కరించుకుని తాజాగా నాగ చైతన్య, సాయి పల్లవి చేసిన 'తండేల్' మూవీ రీల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో హీరో 'బుజ్జి తల్లి వచ్చేత్తన్న కదే. కుతంత నవ్వవే' అని డైలాగ్ చెబుతాడు. దీంతో హీరోయిన్ క్యూట్ స్మైల్‌తో ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియోకు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా.. 'తండేల్' మూవీలో నాగ చైతన్య సరసన నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











