నాగచైతన్య రెండో పెళ్లి.. టాలీవుడ్‌లో సెకండ్ మ్యారేజ్ చేసుకొన్న వారు ఎవరెవరో తెలుసా?

Celebrities 2nd Marriage: ప్రపంచంలో భారతీయ వివాహ వ్యవస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. నిండు నూరేళ్లు భార్యాభర్తలు తోడూనీడగా జీవించాలని కోరుకుంటూ పెద్దలు వివాహ బంధంతో జంటను ఒక్కటి చేస్తారు. కానీ, అనుకోని కారణాల వలన కొంత మంది మధ్యలోనే తమ వివాహబంధాన్ని తెంచుకుంటున్నారు. . కొందరు ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తూంటే.. మరికొందరూ మరొకరితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ కొంతమంది తారాలు తొలి వైవాహిక బంధాన్ని తెంచుకున్న మరోపెళ్లి చేసుకుని జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నారు. ఇలా రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్న సెలెబ్రెటీలు ఎవరో ఓ లూక్కేద్దాం..

నాగచైతన్య

యువ సామ్రాట్ హీరో నాగచైతన్య, మల్టీ టాలెంటెడ్ బ్యూటీ సమంతను 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తొలుత వారి వివాహబంధం చాలా అన్యూన్యంగా కొనసాగినా.. పెళ్లైనా నాలుగేండ్లకే విడిపోయారు. వారి మ్యారేజ్ లైఫ్ కు తెర దించారు. ఈ తరుణంలో నటి శోభిత దూళిపాళ్లతో ప్రేమలో పడ్డ చైతూ.. నేడు ఆమెను నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో శోభితను గ్రాండ్ గా రెండవ వివాహం చేసుకోబోతున్నారు నాగ చైతన్య.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement Telugu Actors Who Have Been Married Twice

అక్కినేని నాగార్జున

కింగ్ నాగార్జున కూడా రెండోసారి పెళ్లి చేసుకున్నారు. తొలుత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె వేంకటేష్ చెల్లెలు లక్ష్మీని నాగార్జున వివాహం చేసుకున్నారు. వాళ్లిద్దరి నాగ చైతన్య జన్మించారు. కానీ, కొన్ని మనస్పర్థాల కారణంగా వారి వివాహ బంధానికి బ్రేకులు పడ్డాయి. ఆమెతో విడాకులు తీసుకున్న నాగార్జున తరువాత నటి అమలను పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి సంతానమే అఖిల్.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement Telugu Actors Who Have Been Married Twice

పవర్ స్టార్ పవన్ కల్యాణ్

ఇటు సినిమాల్లో.. అటు పాలిటిక్స్ ల్లో తన సత్తా చాటిన సార్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు మొదటగా నందినిని పెళ్లి చేసుకున్నారు. కానీ, కొన్ని విభేదాల కారణంగా ఆమెతో విడిపోయారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత నటి రేణూ దేశాయ్ (Renu Desai)తో కొంతకాలం సహజీవనం చేసిన పవన్ .. అకిరా నందన్ జన్మించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకు ఈ జంటకు ఆద్య జన్మించింది. కొన్నాళ్లు సంతోషంగానే ఉన్న ఈ విడిపోయింది. ఇలా రేణూకు విడాకులు ఇచ్చి పవన్ ఆ తరువాత రష్యన్ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement Telugu Actors Who Have Been Married Twice

రెబల్ స్టార్ కృష్ణంరాజు

రెబల్ స్టార్ కృష్ణంరాజు రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. రెబల్ స్టార్ తొలుత తన తొలుత బంధువుల అమ్మాయి సితాదేవిని పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఆమె అనూహ్యంగా యాక్సిడెంట్స్ లో కన్నుమూసింది. ఈ ఘటనతో డిప్రెషన్‌లోకి వెళ్లిన రెబల్‌ స్టార్‌.. కొంత కాలానికి పెద్దల ఒత్తిడితో 1996లో శ్యామలాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆయనకు అభిమాని.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

కలెక్షన్ కింగ్, లెజెండరీ నటుడు మోహన్ బాబు కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన మొదటి భార్య విద్య దేవి. ఆమె లక్ష్మి, విష్ణు జననం తర్వాత అనారోగ్య మరణించారు. ఆ తర్వాత పిల్లల బాగోగుల కోసం విద్య దేవి చెల్లెలు నిర్మల దేవిని పెళ్లి చేసుకున్నారు కలెక్షన్ కింగ్. ఆ తరువాత వాళ్లిద్దరికీ మంచు మనోజ్ జన్మించారు.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement Telugu Actors Who Have Been Married Twice

సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ.. కథ చాలా డిఫరెంట్. ఆయన తొలుత తన మరదలు ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. వారి వివాహ బంధం ఎంతో అన్యూన్యంగా సాగింది. కానీ విజయ నిర్మలతో ప్రేమలో పడ్డ కృష్ణ .. ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. వాస్తవానికి కృష్ణ-విజయ నిర్మలకు పెళ్లి చేసుకునే ముందే ఇద్దరు పిల్లలు రమేష్ బాబు, పద్మావతి. విజయ నిర్మలతో పెళ్లి తర్వాత ఇందిరా.. మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని జన్మించారు.

Naga Chaitanya and Sobhita Dhulipala Engagement Telugu Actors Who Have Been Married Twice

నందమూరి తారక రామారావు


తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నటుడు నందమూరి తారక రామారావు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా పేరు తెచ్చుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదటగా బసవతారకంను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు బసవతారకం క్యాన్సర్ తో మరణించించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు.

మంచు మనోజ్
మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటగా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ వారి పెళ్లి మున్నాళ్ల ముచ్చటగా మారింది. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మనోజ్ రాజకీయ ప్రముఖుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికతో ప్రేమలో పడ్డారు. వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఏదిఏమైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో సెకండ్ మ్యారేజ్ వెరీ కామన్ అయిపోయిందని టాక్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X