అమీర్ ఖాన్ టీమ్‌తో నాగచైతన్య స్పోర్ట్స్ వార్.. టెబుల్ టెన్నిస్ రాకెట్ పట్టి దడదడా..
అక్కినేని వారసుడు నాగచైతన్య బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కారు. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ సొంత ప్రొడక్షన్‌లో రూపొందుతున్న లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగులో నాగచైతన్య ఇటీవల జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే షూటింగుకు కొద్ది రోజులు విరామం ప్రకటించడంతో ఆ టీమ్ అంతా ఆటపాటల్లో మునిగిపోయారు. లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగులో జరిగిన ఆటవిడుపు వ్యవహారాల్లోకి వెళితే..

లడఖ్‌లో లాల్ సింగ్ చద్దా
లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ లడఖ్‌లోని పర్వత ప్రాంతంలో నిర్విరామంగా షూటింగ్ జరుగుతున్నది. ఈ షూటింగ్ కోసం భారీ సంఖ్యలో చిత్ర యూనిట్ అక్కడే క్యాంప్ వేసింది. దాదాపు సకుటుంబ సమేతంగా అమీర్ ఖాన్ తదితరులు తరలివెళ్లారు. దాంతో షూటింగ్ అంతా ఫ్యామిలీ అఫైర్‌గా మారింది.

అమీర్ ఖాన్ మూవీలో నాగచైతన్య
లడఖ్‌లో జరుగుతున్న షూటింగ్‌లో నాగచైతన్య జాయిన్ అవ్వడంతో తన బాలీవుడ్ కెరీర్‌ను ప్రారంభించారు. అమీర్ ఖాన్, కిరణ్ రావు, దర్శకుడితో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. అలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో నాగచైతన్య భాగమయ్యారు.

షూటింగ్ బ్రేక్‌లో స్పోర్ట్స్ కాంపిటీషన్స్
అయితే లాల్ సింగ్ చద్దా షూటింగుకు ప్రస్తుతం కొంచెం గ్యాప్ లభించడంతో అమీర్ ఖాన్ యూనిట్ సభ్యులకు టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందుకోసం ఓ హల్‌ను టేబుల్ టెన్సిస్ స్టేడియంగా మార్చారు. అందులో టీమ్ సభ్యులందరూ కలిసి టేబుల్ టెన్నిస్ పోటీలను ఆడారు.

యూనిట్ సభ్యులతో అమీర్ ఖాన్ ఫన్ టైమ్
ఇటీవలే భార్య నుంచి విడాకులు తీసుకొన్న అమీర్ ఖాన్ తన పిల్లల సంరక్షణ బాధ్యతను చూస్తున్నారు. ఈ షూటింగుకు తన కుమారుడు ఆజాద్‌తో కలిసి వెళ్లారు. తన కుమారుడితో అమీర్ ఖాన్ టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఫన్‌టైమ్‌ను ఎంజాయ్ చేశారు. ఈ చిత్రంలో మాజీ భార్య కూడా ఉన్నారు.
Recommended Video

నాగచైతన్య టేబుల్ టెన్నిస్ రాకెట్‌తో
అలాగే నాగ చైతన్య కూడా తన యూనిట్ సభ్యులతో టేబుల్ టెన్నిస్ ఆడారు. టోర్నమెంట్‌తో తోటి నటులు, సాంకేతిక నిపుణులతో పోటీ పడ్డారు. సరదాగా తన ఆటకు పదునుపెట్టి అందర్ని ఆకట్టుకొన్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











