దీపావళి స్పెషల్ పోస్టర్.. పెళ్లి పీటలెక్కిన సాయి పల్లవి-నాగచైతన్య!!
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫిదా తరువాత మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మళ్లీ సాయి పల్లవితోనే మ్యాజిక్ చేసేందుకు సిద్దమయ్యాడు. అయితే ఈ సారి నాగ చైతన్య అదనపు ఆకర్షణగా నిలవనున్నాడు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో లవ్ స్టోరీ రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్, పోస్టర్లు ఫుల్ వైరల్ అయ్యాయి. సినిమాపై అంచనాలను పెంచేశాయి.
వేసవిలో అందరినీ కూల్ చేసేందుకు లవ్ స్టోరీ సినిమా రావాల్సింది. కానీ కరోనా, లాక్డౌన్ వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. సినిమా షూటింగ్‌లన్నీ బంద్ కావడంతో లవ్ స్టోరీ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక మళ్లీ లవ్ స్టోరీ సెట్స్ పైకి వెళ్లింది. మొత్తానికి సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యేందుకు వచ్చింది. తాజాగా దీపావళి సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ కొత్త పోస్టర్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి పెళ్లి పీటలెక్కినట్టు కనిపిస్తోంది. అంటే సినిమాలోఈ ఇద్దరి కథ సుఖాంతం కానుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరి జంట మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అని చెబుతూ నాగ చైతన్య ఈ కొత్త పోస్టర్‌ను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ మూవీని ఏసియన్ అధినేత సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











