‘లవ్ స్టోరీ’ షూటింగ్ పూర్తైంది.. ఇక విడుదలకు రెడీ!
శేఖర్ కమ్ముల మరోసారి ప్రేక్షకులను తనలోకంలోకి తీసుకెళ్లుందుకు రెడీ అయ్యాడు. ఫిదా సినిమాతో నిజంగానే అందర్నీ ఫిదా చేసేశాడు. ప్రతీ ఒక్కరూ శేఖర్ కమ్ముల సృష్టించిన భానుమతి పాత్రకు పడిపోయారు. మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు శేఖర్ కమ్ముల రెడీ అయ్యాడు. లవ్ స్టోరీ అంటూ నాగ చైతన్య సాయి పల్లవిలతో మాయ చేసేందుకు వస్తున్నాడు. ఈ మేరకు ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది.
ఎప్పుడో రావాల్సిన లవ్ స్టోరీ కరోనా లాక్డౌన్ వల్ల ఆలస్యమైంది. లేదంటే సమ్మర్‌లో శేఖర్ కమ్ముల అందర్నీ కూల్ చేసేవాడు. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైన తరువాత లవ్ స్టోరీ మళ్లీ సెట్స్ పైకి వెళ్లింది. నిజామాబాద్ జిల్లాలో సహజ సిద్దమైన లొకేషన్లలో ఈ మూవీని షూట్ చేశారు. దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతూ వచ్చిన షూటింగ్ నేటితో పూర్తయింది. ఈ మేరకు మేకర్స్ ఓ ఫోటోను షేర్ చేశారు.

దీపావళికి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది అందరిలోనూ ఆసక్తిని పెంచిన లవ్ స్టోరీ యూనిట్ తాజాగా మరో అప్డేట్‌ను అందించారు. షూటింగ్ పూర్తయింది... ఇక విడుదలకు అంతా సిద్దమే అన్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపిస్తోంది. సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. షూటింగ్ పూర్తయిందని షేర్ చేసిన ఫోటోలో సాయి పల్లవిలు ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











