నాగ చైతన్యతో సాయి పల్లవి గుసగుసలు.. కూల్ పోస్టర్‌తో కీలక అప్డేట్

ఫిదా లాంటి కూల్ హిట్‌తో శేఖర్ కమ్ముల మళ్లీ ఫాంలోకి వచ్చాడు.అయితే ఫిదా వచ్చి చాలా రోజులు అవుతున్నా మరో సినిమాతో శేఖర్ కమ్ములు ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ తన తదుపరి చిత్రం మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉండేలానే చేస్తున్నాడు. నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో వస్తోన్న లవ్ స్టోరీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పాటలు, పోస్టర్లు సినిమా భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

మళ్లీ ఫిదా లాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నాడు. మామూలుగా 2020 సమ్మర్ కానుకగా అనుకున్న సినిమా ఇలా వాయిదా పడుతూ వచ్చింది. లాక్డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది. అన్ లాక్ ప్రక్రియ మొదలైన తరువాత సహజసిద్దమైన లొకేషన్లలో లవ్ స్టోరీని తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. నిజామాబాద్‌లోని సిద్దుల గుట్టలో చేసిన సీన్స్, వాటికి సంబంధించి బయటకు వచ్చిన పిక్స్ ఎంతగానో వైరల్ అయ్యాయి.

Naga Chaitanya sai pallavi Love Story Teaser On 10th January

తాజాగా మరోసారి లవ్ స్టోరీ టీం అందరినీ సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. సంక్రాంతి పండుగను లవ్ స్టోరీ టీం కాస్త ముందుగానే తీసుకొస్తోంది. లవ్ స్టోరీ టీజర్‌తో సంక్రాంతి పండుగను మరింత కలర్ ఫుల్‌గా చేసేందుకు రెడీ అయింది. జనవరి 10న లవ్ స్టోరీ టీజర్ రాబోతోందని ప్రకటించారు. జనవరి 10న ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు టీజర్ రాబోతోందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X