twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన ‘లవ్ స్టోరీ’: టాలీవుడ్‌లో మొట్టమొదటి చిత్రంగా ఆల్‌టైం రికార్డు!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చే సినిమాల్లో కొన్నింటికి మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు దక్కుంతుంటోంది. అది దర్శకుడి వల్ల కావచ్చు.. హీరో, హీరోయిన్ల వల్ల కావొచ్చు.. మరే ఇతర కారణం వల్లో కావొచ్చు. సరిగ్గా ఈ కోవలోకే వస్తుంది అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి కలయికలో రాబోతున్న 'లవ్ స్టోరీ'. ఏమాత్రం అంచనాలు లేకుండానే మొదలైన ఈ సినిమా.. ఇప్పుడు మాత్రం భారీ హైప్‌ను క్రియేట్ చేసుకోగలిగింది. తద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ కారణంగానే విడుదలకు ముందే టాలీవుడ్ హిస్టరీలోనే అరుదైన రికార్డును క్రియేట్ చేసిందీ చిత్రం. ఆ వివరాలు మీకోసం!

    హాట్ క్లీవేజ్ షోతో సెగలు రేపుతోన్న బుల్లితెర నటి నియా శర్మ

    వాళ్లిద్దరి మధ్య ‘లవ్ స్టోరీ' అలా పుట్టింది

    వాళ్లిద్దరి మధ్య ‘లవ్ స్టోరీ' అలా పుట్టింది

    'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రమే 'లవ్ స్టోరీ'. నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఏప్రిల్ 16న రిలీజ్ కానుంది.

    అవి వచ్చిన తర్వాత పెరిగిన అంచనాలు

    అవి వచ్చిన తర్వాత పెరిగిన అంచనాలు

    వాస్తవానికి 'లవ్ స్టోరీ' మొదలైన సమయంలో దీనిపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. ఓ మీడియం రేంజ్ సినిమానే అని అంతా అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే పోస్టర్లు, టీజర్‌, పాటలు విడుదల అయ్యాయో.. అప్పటి నుంచి దీనిపై భారీ హైప్ ఏర్పడింది. దీంతో సినీ ప్రియులతో పాటు డిస్టిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు ఈ సినిమాపై ఫోకస్ చేశాయి. తద్వారా అంచనాలు భారీగా పెరిగాయి.

    పాటకు రికార్డు స్పందన.. వివాదాస్పదం

    పాటకు రికార్డు స్పందన.. వివాదాస్పదం

    'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగ దరియా' అనే తెలంగాణ పల్లె పదాల పాట ఫిబ్రవరి 28న స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేతుల మీదుగా విడుదలైంది. ఇందులో సుద్దాల అశోక్ తేజ లిరిక్స్, సాయి పల్లవి డ్యాన్స్, మంగ్లీ గొంతు, పవన్ మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకోవడంతో దీనికి రికార్డు స్పందన వచ్చింది. అదే సమయంలో జానపది గాయని ఎంట్రీతో ఈ పాట వివాదాస్పదం అయింది.

    ఆ మూడింటికే రూ. 16 కోట్లు వచ్చేశాయి

    ఆ మూడింటికే రూ. 16 కోట్లు వచ్చేశాయి

    ప్యూర్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా రైట్స్ కోసం ఎప్పటి నుంచో పోటీ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ హక్కులు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. వీటన్నింటికీ కలిపి రూ. 16 కోట్లు వచ్చినట్లు తెలిసింది. ఇది నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధికంగా జరిగిన బిజినెస్ అని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

    రిలీజ్‌కు ముందే చరిత్ర సృష్టించిన చిత్రం

    రిలీజ్‌కు ముందే చరిత్ర సృష్టించిన చిత్రం

    ఇటీవలి కాలంలో విడుదలైన చిత్రాల్లో ఎక్కువ శాతం విజయాలను నమోదు చేస్తున్నాయి. దీంతో కొత్తగా రాబోయే చిత్రాల బిజినెస్ భారీగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ బిజినెస్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అది కూడా భారీ ధరకు అనే టాక్ వినిపిస్తోంది.

    మొట్టమొదటి చిత్రంగా ఆల్‌టైం రికార్డు!

    మొట్టమొదటి చిత్రంగా ఆల్‌టైం రికార్డు!

    విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా వస్తోన్న 'లవ్ స్టోరీ' అన్ని ఏరియాలలో కలిపి రూ. 30 కోట్లకు పైగా వ్యాపారం జరుపుకుందట. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యధిక మొత్తానికి అమ్ముడు పోయిన మీడియం రేంజ్ చిత్రంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీంతో హీరో అక్కినేని నాగ చైతన్య ఖాతాలో అరుదైన ఘనత వచ్చి చేరింది.

    English summary
    Love Story is an upcoming Indian Telugu -language romantic drama film written and directed by Sekhar Kammula. The film stars Naga Chaitanya and Sai Pallavi. Production and release of Love Story were delayed due to COVID-19 pandemic. The film is scheduled to release on 16 April 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X