అదొక్కటే చేయగలను.. సతీమణి బర్త్ డేపై నాగబాబు ఎమోషనల్
మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఆయన సతీమణి పద్మజపై ప్రేమను కురిపించాడు. పద్మజ పుట్టిన రోజు సందర్భంగా ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రేమను వ్యక్తపరిచాడు. మామూలుగా నాగబాబు ఈ మధ్య తన యూట్యూబ్ చానెల్‌లో కొన్ని వీడియోలు షేర్ చేస్తూ వచ్చాడు. అందులో పిల్లలు, కమ్యూనికేషన్ స్కిల్స్, తల్లిదండ్రుల చాప్టర్ గురించి చెబుతూ నాగబాబు తన వ్యక్తిగత విషయాలెన్నో చెప్పాడు. ఓ సారి ఇలాగే తన భార్య పద్మజకు ఐ లవ్యూ అని చెప్పాడట.
పెళ్లైనా కొత్తలో ఓ సారి హారర్ సినిమాకు చెప్పకుండా తీసుకెళ్లాడట నాగబాబు. హారర్ సినిమాలు భయమని తెలిసి కూడా చెప్పకుండా అలా తీసుకెళ్లానంటూ నాగబాబు ఆ మధ్య చెప్పుకొచ్చాడు. ఓ సారి పర్సనాల్టీ డెవలప్ మెంట్ క్లాసుల్లో తల్లి దండ్రులకు, కట్టుకున్న భార్యకు ఐ లవ్యూలు చెప్పాలని విన్నాను. అయితే తాను పెళ్లైన కొత్తలో ఏదో ఓ సందర్భంగా చెప్పాను.. మళ్లీ చెప్పలేదంటూ నాగబాబు తెలిపాడు. అలా ఓ సారి ఐ లవ్యూ అంటూ మెసెజ్ పంపాను అంటూ నాగబాబు తెలిపాడు.

అలా సమయం సందర్భం వచ్చిన తన సతీమణిపై నాగబాబు ప్రేమను కురిపించాడు. నేడు పద్మజ బర్త్ డే సందర్భంగా నాగబాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. నిన్ను వర్ణించేందుకు పదాలు సరిపోవు.. నువ్ నాకు ఇచ్చిన సపోర్ట్.. నువ్ నా మీద చూపించిన ప్రేమను కొలవలేం.. నువ్ నాకు ఇచ్చిన మొత్తంలో కొంతైనా తిరిగి ఇచ్చేందుకు గానూ నా ప్రేమ అంతా నీపై కురిపిస్తాను.. అదొక్కనే నేను చేయగలను.. నా ప్రియ భాగస్వామి పద్మ హ్యాపీ బర్త్ డే


Click it and Unblock the Notifications











