నిహారిక పెళ్లిపై నాగబాబు ప్రకటన.. ఆలస్యంగా ఇంటికొచ్చినా నో ప్రాబ్లమంటూ కామెంట్

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది మెగా ఫ్యామిలీ. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడంతో పాటు ఓ అమ్మాయి కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడమే. కుటుంబం మొత్తం నటీనటులతో నిండి ఉండడంతో వీళ్లకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇంతటి ప్రఖ్యాతలు ఉన్న మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు నాగబాబు రివీల్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇద్దరు ఔట్.. వాళ్లంతా సిద్ధంగా ఉన్నారు

ఇద్దరు ఔట్.. వాళ్లంతా సిద్ధంగా ఉన్నారు

మెగా ఫ్యామిలీలో దాదాపు పది మంది వరకు హీరోలు ఉన్నారు. వీరిలో నేటి తరంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ మాత్రమే పెళ్లిళ్లు చేసేసుకున్నారు. మిగిలిన వారిలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్‌తో పాటు మెగా డాటర్ నిహారిక కూడా పెళ్లీడుకొచ్చినా సింగిల్‌గానే ఉన్నారు. దీంతో వీళ్లంతా ఎప్పుడు పప్పన్నాలు పెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 మెగా హీరో పెళ్లి... నిహారికతో అతడికి ముడి

మెగా హీరో పెళ్లి... నిహారికతో అతడికి ముడి

కొన్నేళ్లుగా మెగా హీరోల గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాటిలో ఎక్కువగా పెళ్లికి సంబంధించినవే ఉన్నాయి. మరీ ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్‌కు నిహారికకు ముడిపెడుతూ గతంలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. అలాగే, వరుణ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ వినిపించింది. వీరితో పాటు నిహారిక పెళ్లి గురించి పెద్ద చర్చే జరిగింది.

నాగబాబుపైనే అందరి దృష్టి.. ఆయనేమో అలా...

నాగబాబుపైనే అందరి దృష్టి.. ఆయనేమో అలా...

మెగా ఫ్యామిలీలోని మిగిలిన వారితో పోలిస్తే... నాగబాబుపై పెళ్లిళ్ల ప్రభావం భారీగా పడింది. దీనికి కారణం ఆయనకు పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉండడమే. వీరిలో వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతుండగా... నిహారిక మాత్రం సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపుతోంది. నాగబాబు మాత్రం పెళ్లిళ్లు వాళ్ల ఇష్టానికే వదిలేశారు.

నిహారిక పెళ్లిపై నాగబాబు అధికారిక ప్రకటన

నిహారిక పెళ్లిపై నాగబాబు అధికారిక ప్రకటన

తమ పిల్లల పెళ్లిళ్ల గురించి ఇప్పటి వరకు ఏ సందర్భంలోనూ స్పందించలేదు మెగా బ్రదర్ నాగబాబు. అయితే, తాజాగా జరిగిన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాత్రం ఆయన ఈ విషయంపై తొలిసారి ఓపెన్ అయ్యారు. అంతేకాదు, త్వరలోనే నిహారికకు పెళ్లి చేయబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

నిహారిక పెళ్లి వివరాలు చెప్పేసిన నాగబాబు

నిహారిక పెళ్లి వివరాలు చెప్పేసిన నాగబాబు

ఆ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. ‘నిహారికకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. మాకు నచ్చిన పెళ్లిని తను కూడా కాదనడం లేదు. అందుకోసం సంబంధాలు కూడా చూస్తున్నాం. చూసిన వాటిలో ఒకబ్బాయి నచ్చాడు. అతడినే నిహారిక చేసుకుంటుంది. ఈ పెళ్లి వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగేలా ప్లాన్ చేస్తున్నాం' అని ఆయన వివరించారు.

ఇకపై ఆలస్యంగా ఇంటికొచ్చినా నో ప్రాబ్లం

ఇకపై ఆలస్యంగా ఇంటికొచ్చినా నో ప్రాబ్లం

దీనికి కొనసాగింపుగా.. ‘తండ్రిగా పిల్లలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడైతే వాళ్లు బయటకు వెళ్తే.. తిరిగి ఇంటికి వచ్చే వరకు భయపడాలి. ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడాలి. అదేదో వాళ్లకు పెళ్లిళ్లు చేసేస్తే... వాళ్ల భార్యనో భర్తనో ఆ బాధ్యత తీసుకుంటారు. నా పిల్లలైతే నాకు భారం కాదు కానీ, పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుందని అనుకుంటున్నా' అని చెప్పుకొచ్చారాయన.

Recommended Video

Star Heros Special Target On Dussehra Holidays
పిల్లలతో పోటీగా.. ఆయన కూడా ఫుల్ బిజీ

పిల్లలతో పోటీగా.. ఆయన కూడా ఫుల్ బిజీ

ఇటీవల ‘గద్దలకొండ గణేష్'తో భారీ విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత మరిన్ని చిత్రాలు చేసేందుకు సంతకం చేసేశాడు. అలాగే, నిహారిక కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. ఇక, నాగబాబు కూడా ‘అదిరింది' సహా పలు టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X