పెళ్లిపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్: పీక కోసేస్తానని బెదిరించింది.. అందుకే అలా చేశానంటూ!

నాగబాబు.. తెలుగు ప్రజలకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. దీనికి కారణం ఆయన మెగాస్టార్ చిరంజీవి సోదరుడు కావడమే కాదు.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, సీరియల్ యాక్టర్‌గా, షోలలో జడ్జ్‌గా ఎన్నో ఏళ్లుగా మెప్పిస్తుండడమే. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ మెగా బ్రదర్.. ఇప్పటికీ తన సత్తాను చూపిస్తూనే ఉన్నారు. అదే సమయంలో సోషల్ మీడియా పుణ్యమా అని తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. పీక కోసేస్తానని బెదిరించిందని చెప్పారు. ఆ వివరాలు మీకోసం!

కెరీర్ అలా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు

కెరీర్ అలా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రాక్షసుడు' అనే సినిమాతో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు నాగబాబు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను చేశారు. అలాగే, హీరోగానూ కనిపించి మెప్పించారు. ఈ క్రమంలోనే నిర్మాతగా మారి కొన్ని చిత్రాలను తీశారు. ఇలా అప్పటి నుంచి 'అరవింద సమేత' వరకు ఆయన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు.

సీరియల్ హీరోగా ఎంట్రీ.. జబర్ధస్త్‌తో జడ్జ్‌గా

సీరియల్ హీరోగా ఎంట్రీ.. జబర్ధస్త్‌తో జడ్జ్‌గా

సినిమాల్లో సత్తా చాటి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు నాగబాబు. అదే సమయంలో 'అపరంజీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా హీరోగా అడుగు పెట్టారు. దీని తర్వాత 'శిఖరం', 'సీతామహాలక్ష్మీ' సహా కొన్ని సీరియళ్లలో నటించారు. ఇలాంటి పరిస్థితుల్లో 'వీర' అనే షో ద్వారా జడ్జ్‌గా మారి 'అదుర్స్' రెండు సీజన్లను చేశారు. దీని తర్వాత 'జబర్ధస్త్'తో సత్తా చాటారు.

దీనికి గుడ్‌బై.. వాటికి బైబై.. కొత్తగా ఒకటి

దీనికి గుడ్‌బై.. వాటికి బైబై.. కొత్తగా ఒకటి

దాదాపు ఏడేళ్ల పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించారు నాగబాబు. దీంతో ఆయనకు ఎంతగానో పేరు ప్రఖ్యాతలు దక్కాయి. అలాంటి ఈ షోకు అర్థాంతరంగా గుడ్‌బై చెప్పేశారు. అదే సమయంలో మరో ఛానెల్‌లో 'అదిరింది', 'బొమ్మ అదిరింది' అనే షోలు చేశారు. ఇవి కూడా ఉన్నట్లుండి ఆపేశారు. ఇక, స్వయంగా 'ఖుషి ఖుషీగా' అనే షోను మొదలెట్టి.. ఇటీవలే పూర్తి చేశారు.

సోషల్ మీడియాలోనే.. ఆ సెషన్‌లతో బిజీ

సోషల్ మీడియాలోనే.. ఆ సెషన్‌లతో బిజీ

సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో భాగంగానే తన ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను కూడా ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. అదే సమయంలో సమాజంలో ఎన్నో విషయాలపై స్పందిస్తుంటారు. ఇక, ఈ మధ్య కాలంలో తరచూ ఫ్యాన్స్‌తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లు నిర్వహిస్తున్నారు.

రెండో పెళ్లిపై మెగా బ్రదర్ షాకింగ్ కామెంట్స్

రెండో పెళ్లిపై మెగా బ్రదర్ షాకింగ్ కామెంట్స్

ఇటీవల జరిపిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో ఓ నెటిజన్ 'మీరు పెళ్లి చేసుకున్నారా' అని ప్రశ్నించగా.. 'లేదు. వచ్చే సంవత్సరం చేసుకోవాలనుకుంటున్నా.. మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి' అని షాకింగ్ రిప్లై ఇచ్చారు. అలాగే మరొకరు 'సార్ మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా' అని అడగగా.. 'ఈ వయసులో నాకు పెళ్లా. మీకూ మీకూ ఓకే అయితే నాకూ ఓకే' అంటూ బదులిచ్చారు.

మళ్లీ పెళ్లిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

మళ్లీ పెళ్లిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

రెండో పెళ్లి గురించి నాగబాబు చేసిన కామెంట్స్ రెండు రాష్ట్రాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన వార్తల్లో నిలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆయన మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి తన రెండో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

Sarkaru Vaari Paata దూకుడు తరహాలో.. Mahesh Babu ట్రెండింగ్ !
పీక కోసేస్తానని బెదిరించింది అంటూ పోస్టు

పీక కోసేస్తానని బెదిరించింది అంటూ పోస్టు

తాజా సెషన్‌లో ఓ నెటిజన్.. 'మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్' అని నాగబాబును ప్రశ్నించాడు. దీనికి.. 'మా ఆవిడ ఒప్పుకోలేదు. అలాంటి ఆలోచన చేస్తే పీక కోస్తా అని ప్రేమగా చెప్పింది. అంత ప్రేమగా చెప్పిన తర్వాత నేను మాత్రం రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాను' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారాయన. దీంతో మెగా బ్రదర్ మరోసారి ట్రెండ్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X