నిహారిక అలా బలి.. ఆ ఒక్క విషయంలో నాగబాబు ఏడిపిస్తూనే ఉంటాడట!
మెగా డాటర్ నిహారిక, మెగా బ్రదర్ నాగబాబు తండ్రీకూతుళ్ల కంటే మంచి ఫ్రెండ్స్‌లా ఉంటారని చెబితేనే బాగుంటుంది. గారాల పట్టి కోరికలను ఏనాడూ కాదనడట. నిహారిక కోసం నాగబాబు ఏం చేయడానికైనా వెనుకాడబోడు. పదిహేను నిమిషాలు కూతురు కనిపించకపోయే సరికి ఓ దేశం మొత్తాన్ని నాశనం చేయాలన్నంత కోపం వచ్చిందట. అంతలా కూతురిపై ప్రేమను పెంచుకున్న నాగబాబు నిహారికను సరదాగా ఆట పట్టిస్తుంటాడట.

చిన్నతనం నుంచీ..
నిహారికను చిన్న తనం నుంచీ ఆటపట్టిస్తూనే ఉన్నాడట. ఆ మధ్య ఓ ఈవెంట్‌లొ అసలు విషయం బయటపడింది. తన కడుపులోనే పుట్టిందని స్పెషల్ బేబీవి అని నిహారికను నమ్మించాడట. స్కూల్‌లో కూడా చాలా గొప్పగా చెప్పుకుని తిరిగేదట. కానీ ఎనిమిదో క్లాసులో బయాలజీ వల్ల అసలు నిజం తెలియడంతో నాగబాబును నిలదీసిందట.

కాలేజ్‌లో అలా..
అలా కూతురుని ఏడిపించే నాగబాబు కాలేజ్ విషయంలోనూ చేసేవాడట. నిహారిక కాలేజ్‌కు అసలు వెళ్లేదే కాదట. ఎప్పుడో అలా అమాసపున్నానికి వెళ్లేదట. అదే విషయాన్ని ఎప్పుడూ ఎత్తి చూపుతు ఆడుకుంటాడని నాగబాబు సంగతిని అందరి ముందు చెప్పేసింది. దసరా ఈవెంట్‌లో నిహారిక తన తండ్రి ఎలా ఏడిపిస్తాడో పూస గుచ్చినట్టు వివరించింది.

ఆ ఈవెంట్‌లో..
దసరాకు జీ తెలుగులో అదిరిపోయేలా ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ప్రదీప్ శ్రీముఖి పెళ్లి అంటూ దసరాకు సందడి చేయబోతోన్నారు. అందులో భాగంగా బొమ్మ అదిరింది టీంతో పాటు నిహారిక, అనసూయ, జానీ మాస్టర్ వంటి వారంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రోమోల మీద ప్రోమోలు వస్తున్నాయి.
Recommended Video

తీసుకురావడానికి నొప్పేంటి..
తాజాగా రిలీజ్ చేసిన ఓ ప్రోమోలో తన తండ్రి ఎలా ఏడిపిస్తాడో చెప్పుకొచ్చింది. ఇంట్లో ఉన్నప్పుడు ఓ గ్లాస్ నీళ్లు తీసుకురమ్మని చెబుతాడు.. నేను తీసుకురాను అని అంటాను.. 29 శాతం అటెండెన్స్ ఉన్న వాళ్లకు ఓ గ్లాస్ నీళ్లు తీసుకురావడానిని కూడా నొప్పేంటో అని ఏడిపిస్తాడు అంటూ నిహారిక నాగబాబు గురించి చెప్పుకొచ్చింది. మొత్తానికి నిహారిక ఓ బడి దొంగ అని పరోక్షంగా ఏడిపించేస్తాడన్న మాట.


Click it and Unblock the Notifications











