నిహారిక పెళ్లిని అలా ప్లాన్ చేసిన నాగబాబు.. ముందుగా ఆ ప్రముఖుల సమక్షంలో అలా!

By Manoj

పేరుకు మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయే అయినా... స్వతహాగా ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంది నిహారిక కొణిదెల. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ... అద్భుతమైన మల్టీ టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా తనలోని ఎన్నో పాత్రలు బయట పెట్టింది. దీంతో మరిన్ని అవకాశాలతో ముందుకెళ్తోంది. ఇలాంటి తరుణంలో నిహారిక పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. ఆమె వివాహాన్ని నాగబాబు ఎలా చేయనున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

నిహారిక గ్రాండ్ ఎంట్రీ.. నిరాశ తప్పలేదు

నిహారిక గ్రాండ్ ఎంట్రీ.. నిరాశ తప్పలేదు

యాంకర్‌గా మెప్పించిన నిహారిక... ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌ల్లో నటించింది. ఇవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ‘ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇక, ఆ తర్వాత ఆమె చేసిన ‘హ్యాపీ వెడ్డింగ్', ‘సూర్యకాంతం' సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి.

అక్కడ మాత్రం సక్సెస్.. మరో యాంగిల్

అక్కడ మాత్రం సక్సెస్.. మరో యాంగిల్

సినిమాల్లో వరుస షాకులు తగలడంతో నిహారిక యాక్టింగ్‌కు దూరమవుతుందని ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే ఆమె మరో సినిమాలో నటించలేదు. కానీ, గతంలో తనకు పేరు తెచ్చిన వెబ్ సిరీస్‌లను మాత్రం కంటిన్యూ చేస్తోంది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై సూపర్ హిట్ సిరీస్‌లను నిర్మించిన ఆమె.. ఈ మధ్య ‘మ్యాడ్ హౌస్' అనే మరో వెబ్ సిరీస్‌ను అందించింది.

హాట్ ఫొటోలతో రచ్చ... వాటిలో కూడా

హాట్ ఫొటోలతో రచ్చ... వాటిలో కూడా

నిహారిక ఎన్ని పనులు ఉన్నా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలు పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేసింది. అంతేకాదు, తాను ఇకపై గ్లామర్ రోల్స్ కూడా చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

పోలీస్ బాస్ కుమారుడితో నిహారిక పెళ్లి

పోలీస్ బాస్ కుమారుడితో నిహారిక పెళ్లి

నిహారికకు సంబంధాలు చూస్తున్నట్లు ఆ మధ్య నాగబాబు మీడియాకు వెల్లడించారు. దానికి అనుగుణంగానే ఆమెకు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఓ పోలీస్ బాస్ కుమారుడు, యువ వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో వివాహం నిశ్చయించారు. ఈ విషయాన్ని నిహారికనే సోషల్ మీడియాలో తెలిపింది. అంతేకాదు, కాబోయే భర్త ఫొటోను కూడా షేర్ చేసింది.

మెగా డాటర్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్

మెగా డాటర్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్

పెళ్లి కుదిరిన వెంటనే తనకు కాబోయే భర్తతో నిహారిక దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో వీళ్ల పెళ్లి గురించి జోరుగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిహారిక - చైతన్య నిశ్చితార్థం ఆగస్టులోనే జరుగుతుందని మెగా కాంపౌండ్ వెల్లడించింది. అంతేకాదు, అందుకోసం ఆగస్టు మూడో వారంలో ఓ రోజును ఫిక్స్ చేసినట్లూ వార్తలు వచ్చాయి.

Recommended Video

Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
నిహారిక పెళ్లిని అలా ప్లాన్ చేసిన నాగబాబు

నిహారిక పెళ్లిని అలా ప్లాన్ చేసిన నాగబాబు

నిహారిక ఎంగేజ్‌మెంట్ పూర్తి కాకముందే ఆమె పెళ్లి గురించి ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. వాస్తవానికి ఆమె పెళ్లిని డిసెంబర్‌లో చేస్తామని నాగబాబు గతంలోనే చెప్పారు. అప్పటికీ కరోనా ప్రభావం తగ్గేలా కనిపించడం లేదు. అయినప్పటికీ... అప్పుడే చేయాలని ఆయన డిసైడ్ అయ్యారట. కాకపోతే ఈ వేడుకకు కొందరినే ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతోంది.

ముందుగా ఆ ప్రముఖుల సమక్షంలో అలా.!

మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహం కరోనా సమయంలోనే జరిగే అవకాశం ఉండడంతో ఆమె కోసం నాగబాబు ప్రత్యేకమైన ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఫ్యాన్స్, ప్రేక్షకుల కోసం ‘బాపు బొమ్మకు పెళ్లంట' అనే ఈవెంట్ చేస్తున్నారని సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా తన కుమార్తె పెళ్లిని పది మందికి చూపించినట్లు అవుతుందని ఆయన భావించినట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X