అరె నాగబాబులో ఈ కళ కూడా ఉందా?.. ఆ విషయంలో ఎంతో అదృష్టవంతుడట!

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే. సామాజిక సమస్యలపై స్పందిస్తూ.. తన ఫాలోవర్స్, ఫ్యాన్స్‌కు అవగాహన కలిగిస్తున్నాడు. ఇక సినిమాలకు, ఆ గొడవలకు సంబంధించిన విషయాలు కాకుండా జనాలకు ఉపయోగపడే నాలుగు మాటలు చెబుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆ మధ్య మెడికల్ ఇన్సూరెన్స్‌ ఆవశ్యకత చెప్పుకొచ్చాడు. ఈ మధ్య వరుసగా డబ్బు గొప్పదనంపై, సంపాదించే విధానాల గురించి చెప్పుకొస్తున్నాడు.

వివాదాలకు కేరాఫ్..

వివాదాలకు కేరాఫ్..

మామూలుగా నాగబాబు మాట్లాడితేనే అది వివాదాలకు దారి తీసేలా ఉండేది. లాక్డౌన్‌లో నాగబాబు చేసిన ఒక్కో పోస్ట్ ఒక్కో వివాదానికి దారి తీసింది. బాలయ్య బాబు, ఆయన గాత్రంపై చేసిన ట్వీట్, గాంధీ-గాడ్సేల మీద వేసిన పోస్ట్, కరెన్సీ నోట్లపై చేసిన కామెంట్స్ ఇలా ఒకటేమిటి నాగబాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం మాత్రం నాగబాబు వివాదాల జోలికి వెళ్లడం లేదు.

మంచి మాటలు చెబుతూ..

మంచి మాటలు చెబుతూ..

నాగబాబు తన యూట్యూబ్ చానెల్‌లో ఈ మధ్య పది మందికి ఉపయోగ పడే నాలుగు మంచి మాటలు చెబుతూ మంచి వక్త అని నిరూపించుకుంటున్నాడు. ఆ మధ్య మెడిక్లెయిమ్ గురించి మెడికల్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే లాభాల గురించి చెప్పాడు. తనకు జరిగిన సొంత అనుభవాన్ని చెబుతూ.. ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించాడు.

డబ్బు ప్రాముఖ్యత..

డబ్బు ప్రాముఖ్యత..

ఈ మధ్య డబ్బు ప్రాముఖ్యత గురించి చెబుతూ సిరీస్‌ల మీద సిరీస్‌ల వీడియోలు వదులుతున్నాడు. ఎపిసోడ్‌ల కొద్ది విడగొట్టి పార్ట్‌లు పార్టులుగా చెబుతున్నాడు. డబ్బు ఎలా సంపాదించాలి? ఎవరు సంపాధించగలరు? ఎవరికి ఆ అర్హత ఉంది? తన సొంత అనుభవాలు ఏంటి? తాను చూసిన వారి అనుభవాలు ఏంటి? ఇలా ప్రతీ ఒక్క విషయాన్ని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Niharika, Nagababu Funny Conversation With Amaram Akhilm Prema Movie Team
 ఎంతో అదృష్టంగా ఫీలవుతున్నా..

ఎంతో అదృష్టంగా ఫీలవుతున్నా..


తాజాగా నాగబాబు ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇంటి బాల్కనీలో కూర్చుని గిటార్ ప్లే చేస్తూ కవిత్తాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ అందమైన ప్రపంచంలో నేను ఇంకా ఉన్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అంటూ కామెంట్ చేశాడు. ఇక నాగబాబుకు గిటార్ ప్లే చేయడం కూడా వచ్చా? ఈ కళ కూడా ఉందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X