HBD Nagababu.. ఎప్పుడూ మీతోనే ఉంటాను అన్నయ్య.. చిరుపై నాగబాబు ఎమోషనల్
మెగా సోదరలు బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ అందరికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆ ముగ్గురు కూడా ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటారు. ముఖ్యంగా నాగబాబు మాత్రం చిరంజీవికి ఎంతలా అండగా ఉంటాడో, అన్న మాటను ఎలా గౌరవిస్తాడో అందరికీ తెలిసిందే. ఏది ఏం జరిగినా సరే అన్నయ్యను విడిచి పెట్టి వెళ్లను అంటూ నాగబాబు ఎన్నోసార్లు మీడియా ముఖంగానే చెప్పాడు.

తాజాగా అలా..
నాగబాబు పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 29). ఈ సందర్భంగా చిరంజీవి నాగబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. విధేయుడు, ఎమోషనల్, దయాగుణం, సరదాతత్త్వం ఉన్న నా ప్రియ సోదురుడు నాగబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశాడు.

ఎప్పుడూ నీతోనే..
అన్నయ్య చిరంజీవి విషెస్ చూసిన నాగబాబు వెంటనే స్పందించాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు థ్యాంక్స్ అని తెలిపాడు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని అన్న మాటలకు బదులు చెబుతూ.. ఎప్పుడూ నీతోనే ఉంటాను అంటూ అన్నపై ప్రేమను కురిపించాడు.

సాయి ధరమ్ తేజ్ అలా..
సాయి ధరమ్ తేజ్ తన మామకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపాడు. ఈ మేరకు చిన్ననాటి గుర్తులను షేర్ చేస్తూ.. అది ఆట అయినా ఆర్ట్ అయినా నేను ముందుకు వెళ్లాడానికి కారణం మాత్రం నాగబాబు మామే.. నాకు సపోర్ట్, బలన్నా ఇచ్చిన వారిలో నాగబాబు మామ ఒకరు.. ఆయనకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు.
Recommended Video

వరుణ్ తేజ్ ఇలా..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తండ్రికి స్పెషల్ విషెస్ అందజేశాడు. ఈ మేరకు నాగబాబుతో దిగిన అపురూపమైన ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే నాన్న.. అందమైన ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్.. నా బెస్ట్ ఫ్రెండ్‌లా ఉన్నందుకు థ్యాంక్స్.. లవ్యూ అంటూ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











