twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్‌పై ఆ ఇద్దరి దెబ్బ పడిందా? పేలవమైన కలెక్షన్లకు కారణం అదేనా?

    By Krishna
    |

    తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. భారీ అంచనాల మధ్య రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమా కలెక్షన్లపై బాలకృష్ణ, మెగా బ్రదర్ నాగబాబు మధ్య జరిగిన వాగ్యుద్ధం ప్రభావం పడిందనే మాట సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

    బాలకృష్ణ వ్యాఖ్యలతో వివాదం

    బాలకృష్ణ వ్యాఖ్యలతో వివాదం

    పవన్ కల్యాణ్ ఎవరో నాకు తెలియదు అంటూ బాలకృష్ణ.. అందుకు పోటీగా బాలయ్య అంటే నాకు తెలియదు. తెలిసింది ఓ ప్రముఖ కమెడియన్ అంటూ నాగబాబు సైటర్లు విసురుకొన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి చిరంజీవి ఏం చేశాడు? అమితాబ్‌ ఏమైనా పీకాడా? అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను నాగబాబు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు.

    నాగబాబు కౌంటర్‌తో ముదిరిన

    నాగబాబు కౌంటర్‌తో ముదిరిన

    ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో నాగబాబు సీరియస్‌గా స్పందించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి బాలకృష్ణ ఆరుసార్లు నోరు జారారని, అందుకే తాను ఆరుసార్లు వీడియోల్లో బాలకృష్ణ తీరును ఎండగడుతానంటూ వరుసగా వీడియోలతో యూట్యూబ్‌లో ధ్వజమెత్తాడు.

    రాంగోపాల్ వర్మ ఎటాక్

    రాంగోపాల్ వర్మ ఎటాక్

    నందమూరి బాలకృష్ణ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్‌కు ధీటుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో టీజర్లు, పాటలను వర్మ విడుదల చేసి మరో వివాదానికి తెర తీశాడు. ఎన్టీఆర్ బయోపిక్‌ రిలీజ్‌కు ముందు కీలకమైన సమయంలో వర్మ మాటల దాడి పెంచాడు. దాంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్లు, ట్రైలర్లు, పాటలు వైరల్ అయ్యాయి.

    నాగబాబు, వర్మ వ్యాఖ్యలతో

    నాగబాబు, వర్మ వ్యాఖ్యలతో

    ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్‌కు ముందు వర్మ, నాగబాబు చేసిన వ్యాఖ్యలు సినిమాకు ప్రతికూలంగా మారి ఉంటాయనే వాదన వినిపిస్తున్నది. బాలకృష్ణ కూడా బ్రీడ్, బ్లడ్ అంటూ చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. దీంతో అందరివాడైన ఎన్టీఆర్ కొందరికే పరిమితయ్యాడనే మాట వినిపించింది.

    సానుకూలంగా రివ్యూలతో

    సానుకూలంగా రివ్యూలతో

    ఇలాంటి వివాదాలు ఎన్టీఆర్ బయోపిక్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయంటున్నారు. ఎన్టీఆర్: కథానాయకుడు సినిమాకు ఏకపక్షంగా సానుకూలమైన రివ్యూలు వచ్చాయి. అయినా బలంగా వసూళ్లను సాధించలేకపోయాయనే మాట వినిపిస్తున్నాయి. ఓ వైపు భారీ చిత్రాలు కూడా రిలీజ్ కావడం కలెక్షన్లు రాబట్టలేకపోయాయనే వాదన మొదలైంది.

    ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్లు

    ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్లు

    ఎన్టీఆర్ బయోపిక్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో 13 కోట్లకు, ఆంధ్రా థియేట్రికల్ హక్కులను 41 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ.10 కోట్లు, మిగితా ఏరియాలకు రూ.5.90 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ రిపోర్టు. ఇప్పటి వరకు రూ.40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను (నికరంగా 19 కోట్లు) సాధించినట్టు ట్రేడ్ రిపోర్టు.

    English summary
    The biopic on the life of NT Ramo Rao titled NTR Kathanayakudu, which released on January 9 has been received well in the US despite stiff competition from Ram Charan's Vinaya Vidheya Rama, Rajinikanth's petta, Venkatesh's F2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X