రెండో పెళ్లిపై నాగబాబు సంచలన ప్రకటన: ‘వర్జినిటీ’ గురించి ఊహించని విధంగా.. మీకు నచ్చితే ఓకే అంటూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీది ప్రత్యేకమైన స్థానం. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తర్వాత చాలా మంది ఇండస్ట్రీలో తమ తమ రంగాల్లో రాణిస్తూ కుటుంబానికి పేరు తీసుకొస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నాగబాబుదే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, సీరియల్ యాక్టర్‌గా, షోలలో జడ్జ్‌గా ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరించిన ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు తన రెండో పెళ్లి గురించి సంచలన ప్రకటన చేశారు. ఆ వివరాలు మీకోసం!

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హంగామా మధ్య వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్.. పవర్ స్టార్ అంటూ జై కొట్టిన దిల్ రాజు, వేణు శ్రీరాం

అన్నయ్యతోనే మొదలైన సినీ ప్రస్థానం

అన్నయ్యతోనే మొదలైన సినీ ప్రస్థానం

స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి అద్భుతమైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన తర్వాత 'రాక్షసుడు' సినిమా ద్వారా నాగబాబును సినిమాల్లోకి పరిచయం చేశారు. అప్పటి నుంచి మెగా బ్రదర్ ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే, 'రుద్రవీణ' మూవీతో నాగబాబు నిర్మాతగా మారారు. అలా రెండింటిలోనూ చిరుతోనే బోణీ చేశారాయాన.

బుల్లితెరపైకి ఎంట్రీ అలా.. జబర్ధస్త్‌ షోతో

బుల్లితెరపైకి ఎంట్రీ అలా.. జబర్ధస్త్‌ షోతో

సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన నాగబాబు.. 'అపరంజీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా హీరోగా అడుగు పెట్టారు. దీని తర్వాత 'శిఖరం', 'సీతామహాలక్ష్మీ' సహా కొన్ని సీరియళ్లలో నటించారు. ఇలాంటి పరిస్థితుల్లో 'వీర' అనే షో ద్వారా జడ్జ్‌గా ప్రయాణాన్ని మొదలెట్టారు. ఆ తర్వాత 'అదుర్స్' రెండు సీజన్లను చేశారు. దీని తర్వాత 'జబర్ధస్త్'తో సత్తా చాటారు.

పొలిటికల్ ఎంట్రీ కూడా... ఎంపీగా పోటీ

పొలిటికల్ ఎంట్రీ కూడా... ఎంపీగా పోటీ

ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే 'జబర్ధస్త్' షో ద్వారానే తెలుగు వాళ్లకు ఎప్పుడూ టచ్‌లో ఉన్నారు నాగబాబు. ఆ తర్వాత 'అదిరింది', 'బొమ్మ అదిరింది' కూడా చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో గత ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా పని చేశారు. ఇందులో భాగంగానే నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడారు. గతంలో ప్రజారాజ్యంలో పని చేశారు.

కొత్త టాలెంట్‌ను తీసుకొచ్చేందుకు ఇలా

కొత్త టాలెంట్‌ను తీసుకొచ్చేందుకు ఇలా

జబర్ధస్త్ షోలో పని చేసినప్పుడే ఎంతో మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాగబాబు. అదిరిందిలోనూ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇలా కాకుండా స్వతహాగా కొందరిలోని టాలెంట్‌ను గుర్తించి వాళ్లను వెలుగులోకి తీసుకు రావాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే సొంతంగా 'ఖుషీ ఖుషీగా' అనే స్టాండప్ కామెడీ షోను ప్రారంభించారు. ఇది ఫినాలేకు సైతం చేసుకుంది.

ఎప్పుడూ అక్కడే.. ఫ్యాన్స్‌తో సెషన్స్‌తో

ఎప్పుడూ అక్కడే.. ఫ్యాన్స్‌తో సెషన్స్‌తో

సోషల్ మీడియాలో నాగబాబు యమ యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో భాగంగానే తన ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను కూడా ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. అదే సమయంలో సమాజంలో ఎన్నో విషయాలపై స్పందిస్తుంటారు. ఇక, ఈ మధ్య కాలంలో తరచూ ఫ్యాన్స్‌తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లు నిర్వహిస్తున్నారు.

‘వర్జినిటీ' గురించి ఊహించని విధంగా

‘వర్జినిటీ' గురించి ఊహించని విధంగా

తాజాగా నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించి.. నెటిజన్లు ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ చెప్పిన 'ఆ యూ ఏ వర్జిన్' అనే డైలాగుతో నాగబాబును ప్రశ్నించాడు. ఈ ఊహించని ప్రశ్నకు షాకైన ఆయన.. 'అరే ఏంట్రా ఇది' అనే మీమ్‌ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైలర్ అయింది.

రెండో పెళ్లిపై నాగబాబు సంచలన ప్రకటన

రెండో పెళ్లిపై నాగబాబు సంచలన ప్రకటన

ఇక, ఇదే సెషన్‌లో ఓ ఔత్సాహిక నెటిజన్ 'మీరు పెళ్లి చేసుకున్నారా' అని ప్రశ్నించగా.. 'లేదు. వచ్చే సంవత్సరం చేసుకోవాలనుకుంటున్నా.. మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి' అని షాకింగ్ రిప్లై ఇచ్చారు. అదే సమయంలో మరొకరు 'సార్ మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా' అని అడగగా.. 'ఈ వయసులో నాకు పెళ్లా. మీకూ మీకూ ఓకే అయితే నాకూ ఓకే' అంటూ ఊహించని జవాబిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X