అల్లుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు: చైతన్య కోసం ఏకంగా అంత ఖర్చు.. ప్లాన్ సీక్రెట్ రివీల్

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. దాదాపు మూడు దశాబ్ధాలుగా తన మార్కు చూపిస్తున్నారు నాగబాబు. సినిమాలకు సినిమాలు.. సీరియళ్లకు సీరియళ్లు.. టీవీ షోలకు టీవీ షోలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న ఆయన.. పర్సనల్ లైఫ్‌నూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవలే తన కూతురు నిహారికకు వివాహం చేసిన మెగా బ్రదర్.. ఇప్పుడు తన అల్లుడు చైతన్య జొన్నలగడ్డకు అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్టును అందించారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేసిన నాగబాబు.. ఆ ఆనందాన్ని వీడియోతో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం!

ఐషా శర్మ.. క్లివేజ్ షో రచ్చ మాములుగా లేదు

అలా చేసిన వారిలో నాగేంద్రబాబు ఒకరు

అలా చేసిన వారిలో నాగేంద్రబాబు ఒకరు

సాధారణంగా సినీ పరిశ్రమలోకి వారసులుగా కొడుకులను మాత్రమే పరిచయం చేస్తుంటారు. కానీ, తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తన కూతురు నిహారికను సైతం గ్లామర్ ఫీల్డులోకి దించారు. తండ్రి పేరును నిలబెట్టేందుకు ఆమె ఎన్నో రకాలుగా కృషి చేసింది. ఇందులో భాగంగానే షార్ట్ ఫిల్మ్‌లు, సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం

చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం

కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే తమ కుమార్తెకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని భావించారు నాగబాబు. అందులో భాగంగానే ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో వీళ్ల పెళ్లి జరిపారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఫ్యామిలీ అంతా వచ్చింది.

హీరోగా ఎంట్రీకి నాగబాబు అల్లుడు రెడీ

హీరోగా ఎంట్రీకి నాగబాబు అల్లుడు రెడీ

నిహారిక భర్త చైతన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం మెగా బ్రదర్ స్వయంగా ప్రయత్నాలు జరుపుతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే చైతన్య కొన్ని విభాగాల్లో శిక్షణ తీసుకోబోతున్నాడని కూడా అంటున్నారు. అయితే, ఈ వార్తలపై క్లారిటీ మాత్రం రావట్లేదు.

అల్లుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాబు

అల్లుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాబు

స్వతహాగా చైతన్య యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్నాడు. ఇందుకోసం హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. అలాగే, తరచూ తన భార్య నిహారికతో కలిసి టూర్లు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా నాగబాబు... తన అల్లుడు చైతన్యకు ఓ ఖరీదైన కారును గిఫ్టుగా అందించారు. దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అప్‌లోడ్ చేశారు.

నాగబాబు కొన్న కారు విలువ ఎంతంటే?

నాగబాబు కొన్న కారు విలువ ఎంతంటే?

చైతన్య జొన్నలగడ్డ కోసం నాగబాబు రేంజ్‌రోవర్‌ డిస్కవరీ కారును కొనుగోలు చేశారు. అది కూడా అతడికి తెలియకుండానే దీనిని బుక్ చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఆ కారును డెలివరీ చేశారు. దీని విలువ దాదాపు రూ. 70 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. తెలుగు రంగులో మెరిసిపోతోన్న ఈ కారులో చైతన్య.. తన భార్య నిహారికతో కలిసి రైడ్‌కు సైతం వెళ్లాడని టాక్.

Recommended Video

Acharya : స్లో పాయిజన్ లా ఎక్కుతున్న Laahe Laahe Song
అప్పుడే ప్లాన్.. వివరించిన మెగా బ్రదర్

అప్పుడే ప్లాన్.. వివరించిన మెగా బ్రదర్

ఈ కారును చైతన్యకు అందించిన తర్వాత నాగబాబు మాట్లాడుతూ... 'పెళ్లి తర్వాత మా అల్లుడు చైతన్యకు ఇప్పటి వరకూ ఎలాంటి కానుకనూ ఇవ్వలేదు. ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఉగాదికి ఓ బహుమతి ఇద్దామనుకున్నా.. కుదరలేదు. ఇప్పుడు అతడి కోసం ఓ రేంజ్‌రోవర్‌ డిస్కవరీ కారును తీసుకున్నాం' అని చెప్పుకొచ్చారాయన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X