ఇండస్ట్రీని దున్నేస్తున్నావ్.. చిరంజీవికి అభిమానిలా మారిన నాగార్జున.. బిగ్‌బ్రదర్, బిగ్‌బాస్ అంటూ
టాలీవుడ్‌లో చిరంజీవి, నాగార్జున మధ్య ఉండే అనుబంధం ప్రత్యేకమైనది. వారిద్దరి మధ్య అన్యోన్యత మరోసారి బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే రోజున స్పష్టమైంది. వేదిక మీదకు చిరంజీవిని ఆహ్వానించే క్రమంలో ఆయనకు నాగార్జున అభిమానిలా మారిపోయారు. ఈ సందర్భంగా చిరంజీవి, నాగ్ మధ్య సంభాషణ ఎలా జరిగిందంటే..

బిగ్‌బాస్‌లో స్పెషల్ గెస్టుగా
బిగ్‌బాస్ తెలుగు 4 ఫైనల్‌కు చేరిన ఇద్దరు కంటెస్టెంట్లకు ట్రోఫిని అందించడానికి ఓ స్పెషల్ గెస్ట్‌ను పిలిచాం. నాకు అత్యంత సన్నిహితుడు, నాకు బిగ్‌బ్రదర్, ఇండస్ట్రీకి బిగ్‌బాస్ చిరంజీవికి గ్రాండ్ వెల్‌కమ్ అంటూ నాగార్జున గట్టిగా అరిచారు. చిరంజీవి నటించిన సినిమా పాటలను ప్లే చేస్తూ మెగాస్టార్‌ను బిగ్‌బాస్ వేదిక మీదకు గ్రాండ్‌గా తీసుకొచ్చారు. చిరంజీవిని ప్రేమగా కౌగిలించుకొని నాగార్జున సాదరంగా ఆహ్వానించారు.

చిరంజీవికి ఘన స్వాగతం
ఇక గ్యాలరీలో కూర్చొని ఉన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్, సీజన్ 4లో పాల్గొన్న సెలబ్రిటీలందరూ లేచి నిలబడి చిరంజీవికి స్వాగతం పలికారు. చిరంజీవిని బిగ్‌బాస్ అంటూ కేరింతలు కొడుతూ ఆనందంలో మునిగిపోయారు. వారందరికి చిరంజీవి వినమ్రంగా నమస్కారం చేశారు. దాంతో అందరూ ఈలలు వేసి గొల చేశారు.

చిరంజీవిని ఆటపట్టించిన నాగార్జున
ఆ తర్వాత నేను ఏమన్నాను.. మన బిగ్‌బాస్ అన్నానా లేదా అంటూ నాగార్జున ఇంటి సభ్యులతో అనడం కనిపించింది. చిరంజీవి సన్నగా, నాజుకూగా ఉండటంపై నాగార్జున ఆటపట్టించారు. ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. మళ్లీ టాలీవుడ్‌లో రూలింగ్ మొదలైంది అంటూ నాగార్జున అభిమానిగా మారిపోయారు.

నాగార్జున హోస్టింగ్ సూపర్
అనంతరం నాగార్జునపై ప్రశంసలు గుప్పించారు. సీజన్ 3, సీజన్ 4 చాలా ఛేంజ్ తీసుకురావడంలో నాగార్జున సఫలమయ్యారు. బ్రదర్‌గా కోపగించుకొన్నారు. ప్రేమతో కంటెస్టెంట్లను చూసుకొన్నారు. సీజన్ 4ను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. అద్భుతంగా షోను నిర్వహించారు. సీజన్ 10 వరకు కూడా నాగార్జునే హోస్ట్‌గా ఉండాలి అంటూ చిరంజీవి విషెస్ అందజేశారు.
Recommended Video

స్టార్ మా నంబర్ 1 ఛానెల్
ఇక స్టార్ మా ఛానెల్ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఛానెల్‌గా నిలిచింది. అందుకు కారణం బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఫెర్ఫార్మెన్స్, ఆటతీరు, ప్రేక్షకుల ఆదరణ వల్లే ఇది సాధ్యమైంది అంటూ చిరంజీవి అన్నారు. అలాగే ఈ షోను ముందుకు తీసుకెళ్లాలి అంటూ చిరంజీవి ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











