నా ఫస్ట్ క్రష్.. తొలి ముద్దు వారితోనే.. అఫైర్స్ గురించి చెప్పిన నాగార్జున

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కేవలం వెండి తెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా రొమాంటిక్‌గా ఉంటారని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. ఆయన జీవన విధానం చూస్తే ఆ మాట కరెక్టే అనిపిస్తుంది. అలాంటి నాగ్ జీవితంలో ఎన్నో ప్రేమ కథలు, ముద్దు ముచ్చటలు ఉండటం చాలా సాధారణమే. అలాంటి టాలీవుడ్ మన్మథుడు తాజాగా అన్నమయ్య చిత్రం విడుదలై 23 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..

Recommended Video

Akkineni Nagarjuna Reveals About His First Kiss , Crush And Love
స్కూల్‌ టీచర్‌పై ఫస్ట్ క్రష్

స్కూల్‌ టీచర్‌పై ఫస్ట్ క్రష్

నా జీవితంలో మొదటి లవ్ లేదా క్రష్ స్కూల్‌లోనే మొదలైంది. అందరు విద్యార్థుల మాదిరిగానే నేను కూడా నా స్కూల్ టీచర్‌ను చూసి ప్రేమలో పడ్డాను. అప్పుడు ఆమె అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్ డేస్‌లో ఆమెను చూస్తూనే నా జీవితం అలా గడిచిపోయింది అని నాగార్జున తన బాల్యం నాటి సంగతులను గుర్తు చేసుకొన్నారు.

 నా తొలి బ్రేకప్ అలా

నా తొలి బ్రేకప్ అలా

నా జీవితంలో నా తొలి బ్రేకప్ కూడా నా స్కూల్ టీచర్‌తోనే. నా ఇష్టం ఎప్పుడూ ప్రేమగా మార్చుకోలేదు. నా టీచర్ మీద ఉంటే ఇష్టాన్ని నా మనసులో దాచుకొన్నాను. అలా టీచర్‌కు ప్రేమను చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయాను. అప్పట్లో అదొక గుండెకోతగా ఉండేది అని నాగార్జున తన తొలి క్రష్ గురించి చెప్పారు.

నా తొలి ముద్దు అనుభవం

నా తొలి ముద్దు అనుభవం

ఇక నా తొలి ముద్దు కాలేజ్‌లో జరిగింది. నా కాలేజ్‌లో ఓ అమ్మాయిని తొలిసారి ముద్దు పెట్టుకొన్నాను. ఆమె పేరు చెప్పడం బాగుండదు. కాలేజీలో ఓ అమ్మాయి అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఆమెతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకొన్నా నాకు హృదయంలో ఓ రకమైన ఫీలింగ్ కలుగుతుంటుంది అని నాగార్జున చెప్పారు.

ఫ్యామిలీ లైఫ్ గురించి

ఫ్యామిలీ లైఫ్ గురించి

ఇక నాగార్జున ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే.. తన తొలి వివాహం హీరో వెంకటేష్ సోదరి లక్ష్మితో జరిగింది. వారిద్దరికి నాగచైతన్య పుట్టిన తర్వాత అభిప్రాయాలు బేధాలు తలెత్తడంతో విడిపోయారు. అనంతరం అమలను పెళ్లి చేసుకొన్నారు. ప్రస్తుతం నాగ్, అమల దంపతులకు అఖిల్ సంతానం ఉన్న సంగతి తెలిసిందే.

నాగ్ కెరీర్ గురించి

నాగ్ కెరీర్ గురించి

ఇక నాగార్జున కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో బ్రహ్మస్త్ర అనే చిత్రంలో నటిస్తున్నారు. అందులో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ హీరో, హీరోయిన్లు కాగా అమితాబ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. తెలుగులో వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్ర షూటింగ్ థాయ్‌లాండ్‌లో చిత్రీకరించాలని అనుకొన్నారు. కానీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X