Don't Miss!
- News
ముఖ్యమంత్రి విశాఖకు మారే అధికారం ఉంది - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మరో ప్రాణాన్ని కాపాడిన మహేష్ బాబు.. నమత్ర ఎమోషనల్
మహేష్ బాబు తెరపైనే కాకుండా తెర వెనుకా హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటారు. సినిమాల్లో చేసే సాయాలు, మంచి పనులు నిజ జీవితంలోనూ చేస్తుంటారు. మహేష్ బాబు చేస్తోన్న మంచి పనుల గురించి, సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ఎంతో మంది చిన్నారులకు ప్రాణం పోశారు. ఇంకా ఎంతో మందికి ఊపిరిపోస్తున్నారు.
మహేష్ బాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారులకు గుండెకు సంబంధించిన చికిత్స చేయిస్తుంటారు. ఇప్పటికే దాదాపు వెయ్యి మందికి పైగా చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఈ మేరకు వీటికి సంబంధించిన విషయాలను నమ్రత ఎప్పటికప్పుడూ షేర్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె మరో మంచి విషయాన్ని చెప్పారు. తాజాగా ఓ చిన్నారి చికిత్స చేయించుకుని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఈ మేరకు ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఎంతో సంతోషాన్నిచ్చే విషయం విన్నాను.. అంకిత్ భార్గవ్‌కు జరిగి చికిత్స సక్సెస్ అయింది.. ఇప్పుడు బాగానే ఉన్నాడు.. డిశ్చార్జ్ అయ్యాడు.. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.. ఆంధ్రా హాస్పిటల్స్ డాక్టర్ల బృందానికి ధన్యవాదాలు అని నమత్ర తెలిపారు. ప్రస్తుతం ఈ వార్తపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు.