twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్లో లేకపోతే అక్కడే ఉన్నట్టు.. మహేష్‌పై నమ్రత కామెంట్

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నమ్రతా అప్డేట్ ఇస్తూనే ఉంటోంది. ఈ లాక్ డౌన్ సమయంలో మహేష్ తన ఇంటి ఆవరణలోనే ఓ అత్యాధునిక జిమ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ జిమ్‌కు సంబంధించిన ఫోటోలు,వీడియోలు అప్పట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

    ఆ మధ్య మహేష్ కొత్త జిమ్ సెంటర్ విశేషాలను చూపిస్తూ నమ్రత షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అయింది. ఎంతో అత్యాధునిక పరికరాలు, మరెన్నో హంగులతో కూడిన జిమ్‌ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నామని నమ్రత చూపిన వీడియో హల్చల్ చేసింది. జిమ్ చేయాలంటే ఎప్పుడూ అలిసిపోమని, హోమ్ జిమ్, ఫీల్ ఇట్ రీల్ ఇట, ఫీల్ ది థండర్ అంటూ నమ్రత చెప్పిన ఆ జిమ్‌లో మహేష్ ఫుల్ వర్కౌట్లు చేస్తూ బిజీగా ఉంటున్నాడట.

     Namrata Shares Video Mahesh Babu Workout in His Home GYM

    తాజాగా మహేష్ వర్కౌట్లు చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ఇదంతా ఇక్కడే జరుగుతోంది. అతని హోమ్ జిమ్.. అద్భుతమైన బర్త్ డే గిఫ్ట్.. మాస్టర్స్ డెన్.. ఆయన ఒకవేళ ఇంట్లో ఎక్కడా కనిపించకపోతే.. జిమ్‌లో ఉన్నట్టే అంటూ నమ్రత భర్త గురించి ఎంతో ప్రేమగా చెప్పుకొచ్చింది. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట కోసం సన్నద్దమవుతున్నాడు. కరోనా ఉధృతి కాస్త తగ్గిన తరువాతే సెట్‌లోకి వెళ్దామని మహేష్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

    English summary
    Namrata Shares Video Mahesh Babu Workout in His Home GYM. VerifiedIt all happens here ...His home gym !! His perfect birthday gift!! Masters den !! U know where to find him if he’s not in the house
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X