అదే నాకు ఆనందం.. అందులో మైమరిచిపోతానంటోన్న నమ్రత
ఆడవారికి, పువ్వులకు ఏదో ఓ అవినాభావ సంబంధం ఉంటుంది. మహిళలకు పూలంటే ఎంతో ప్రతీ. అది సాధారణ మహిళలకైనా సరే స్టార్ సెలెబ్రిటీలకైనా సరే. సరిగ్గా అదే విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ నిరూపించింది. తనకు పూలన్నా, పూదోటలన్నా ఎంతో ఇష్టమని, వాటిని చూస్తూ మైమరిచిపోతానని పూలగొప్పదనాన్ని చెప్పుకొచ్చింది. ఈ మేరకు నమ్రత షేర్ చేసిన ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది.
నమ్రత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఎంతో సరదాగా గడుపుతున్నాడో, సితార, మహేష్, గౌతమ్‌ల అల్లరిని మెమోరీ థెరపీ పేరిట అభిమానులకు రోజుకో వీడియోనో, ఫోటోనో షేర్ చేస్తూ ఉండేది. నమ్రత తన వ్యక్తిగత విషయాలకంటే కుటుంబానికి సంబంధించిన సంగతులే అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

'పువ్వులను చూస్తే నాకు సంతోషం కలుగుతుంది. వికసించడం, వాటి రంగులు, వాటి వాసన అన్ని కూడా సంతోషానికి ప్రతీకలే. ప్రేమను నింపుతాయి. వెంటనే మన మూడ్‌ను మార్చేసి మైమరిచిపోయేలా చేస్తాయి. గార్డెన్‌లో తిరిగినా, రూమ్‌లో పువ్వులను చూసినా నా మూడ్ మారిపోతుంది. మీకు వేటిని చూస్తే అలా అనిపిస్తుంది. మీరు ఆ విషయాన్ని నాతో పంచుకోండ'ని నమ్రత ఓ పోస్ట్ షేర్ చేసింది.



Click it and Unblock the Notifications











