నా లైఫ్ లైన్స్.. నమ్రత ఎమోషనల్‌గా.. క్రేజీగా మహేష్.. ఫ్యాన్స్ ఫిదా.. వైరల్‌గా ఫోటోలు

సూపర్‌స్టార్ మహేష్‌బాబు సతీమణి, అలనాటి హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. వీలు చిక్కితే తన భర్త, పిల్లల ఫోటోలను ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. తన కుటుంబంలోని తీపి గుర్తులను ప్రిన్స్ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకొంటారు. తాజాగా నమత్ర పోస్టు చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే..

ఎమోషనల్‌గా నమ్రత శిరోద్కర్ ఫోటో షేర్

ఎమోషనల్‌గా నమ్రత శిరోద్కర్ ఫోటో షేర్

ప్రిన్స్ మహేష్ బాబు, కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితారతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో నమ్రత షేర్ చేసింది. ఈ ఫోటోలో ఉన్నవారంతా నా జీవన రేఖలు (లైఫ్‌లైన్స్) అంటూ ఓ పోస్టు పెట్టారు. ఈ ఫోటోకు అభిమానులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా లవ్లీ ఫ్యాన్స్, బ్యూటీఫుల్ కపుల్స్ అంటూ ఫ్యాన్స్ వారికి విషెస్ చెబుతూ రకరకాలా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

 బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా నమ్రత

బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా నమ్రత

ప్రస్తుతం నటనకు స్వస్తి చెప్పిన నమత్ర బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా మారారు. ఏఎంబీ సినిమాస్, మహేష్‌కు సంబంధించిన యాడ్స్, బ్రాండింగ్, సినిమా ఓవర్సీస్, బాలీవుడ్ బిజినెస్‌లను దగ్గరుండి చూసుకొంటున్నారు. అంతేకాకుండా మహేష్ చేసే ప్రాజెక్టులను ఇప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు.

మహర్షిగా ప్రిన్స్ మహేష్ బాబు

మహర్షిగా ప్రిన్స్ మహేష్ బాబు

మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే మహేష్, పూజా హెగ్డేపై అన్నపూర్ణ స్టూడియోలో రెండు పాటలను చిత్రీకరించారు. తాజాగా పాటకు సంబంధించిన మహేష్ ఫోటోను రిలీజ్ చేయగా క్రేజీగా మారింది.

మే 9న మహర్షి విడుదల

మే 9న మహర్షి విడుదల

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ మహర్షి చిత్రం మే 9న రిలీజ్ అవుతున్నది. నిర్మాత అశ్వినీదత్‌కు అత్యంత సెంటిమెంట్‌గా ఉండే తేదీ అది. ఆ రోజున జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి రిలీజై మంచి విజయాలు అందుకొన్నారు. మహర్షి సినిమాను సెంటిమెంట్‌గా అదేరోజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X