మహేష్ పాట సితార ఆట.. సూపర్బ్ పర్‌ఫార్‌మెన్స్.. వైరల్ వీడియో
మహేష్ బాబు గారాలపట్టి సితార ఎంతో యాక్టివ్ గా ఉంటుందనే విషయమా అందరికీ తెలిసిందే. మహేష్- నమత్రల కూతురిగా అతి చిన్న వయసులోనే తన ఆట పాటలతో, చలాకీతనంతో మంచి గుర్తింపు తెచ్చుకొంది సితార. గతంలో మహేష్ సినిమాలో పాట పాడి తన సింగింగ్ టాలెంట్ చూపిన ఈమె తాజాగా తనలో డాన్సింగ్ టాలెంట్ కూడా ఉందని నిరూపించింది.
మహేష్ బాబు హీరోగా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ సాధించిన మహర్షి సినిమాలోని ''పాలపిట్ట'' పాటకు డ్యాన్స్ చేసి సూపర్బ్ పర్‌ఫార్‌మెన్స్ అనిపించుకుంటోంది సితార. ఆమె చేసిన ఈ డాన్స్ వీడియోను మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'ఎంత చక్కగా ఉన్నావో. ప్రతీ దినం నా సంతోషానికి కారణం నువ్వే అవుతున్నావు' అంటూ తన ముద్దుల కూతురిపై ప్రేమ కురిపించింది నమ్రత. ఈ వీడియోలో సితార చాలా యాక్టీవ్ పర్‌ఫార్‌మెన్స్ చూపడంతో ఆమె పోస్ట్ చేసిన కాసేపట్లోనే వైరల్ అయిపోయింది.

ఈ వీడియోలో ఎంతో ఉత్సాహంగా సితార వేసిన స్టెప్పులు చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సితార టాలెంట్‌ని పొగిడేస్తూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ''సూపర్ సితార, గ్రేట్ టాలెంట్, ఫ్యూచర్ సూపర్‌స్టార్, వీడియో షేర్ చేసినందుకు థాంక్స్ నమ్రత, ఓ మై గాడ్ సూపర్బ్ ఎక్స్‌ప్రెషన్స్'' అంటూ పదే పదే ఆ వీడియో చూసి మురిసిపోతున్నారు.
మరోవైపు తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటూ చిన్నతనంలోనే యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది సితార. దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో A&S పేరుతో ఛానల్‌ను ప్రారంభించి వావ్ అనిపించింది సితార. ఆమె ప్రారంభించిన ఈ యూ ట్యూబ్ ఛానెల్‌కి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది.


Click it and Unblock the Notifications











