మామూలు క్రేజ్ కాదిది.. బాలయ్య బర్త్ డే కామన్ డీపీ వైరల్
నందమూరి బాలకృష్ణ అంటే తెలుగు నాట ఉండే క్రేజే వేరు. బాలయ్య తొడ కొడితే బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే. మీసం మెలేస్తే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. నందమూరి నటసింహం బాలకృష్ణ బర్త్ డే (జూన్ 10) వేడుకలు ముందుగానే ఆరంభం అయ్యాయి. ఈ మధ్య కామన్ డీపీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బర్త్ డేకు రెండు మూడు రోజుల ముందే కామన్ డీపీలు హల్చల్ చేస్తుంటాయి. తాజాగా రిలీజ్ చేసిన బాలయ్య బర్త్ డే కామన్ డీపీ సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తోంది.
టాలీవుడ్ సెలెబ్రిటీలు, హీరోలు, దర్శక నిర్మాతలందరూ కామన్ డీపీని ట్వీట్ చేస్తున్నారు. ఇక నందమూరి ఫ్యాన్స్ ఈ డీపీని తెగ వైరల్ చేస్తున్నారు. 'ఆయనకి కష్టం వస్తే అర గంట ఆలస్యం గా వెల్తారు ఏమో, అయిన వాళ్ళకి వస్తే మాత్రం అర క్షణం కూడా ఆలోచించరు' అని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ డీపీని షేర్ చేశారు. "నా గుండెల్లో కాల్చే హక్కు ఇద్దరికే ఇస్త, ఫ్యాన్స్ & ఫామిలీ, ఔటర్స్ నాట్ అల్లొవ్డ్" అని పూరి కనెక్ట్స్ డీపీని షేర్ చేసింది.

బాలయ్య బర్త్ డే డీపీ పది హేను నిమిషాల్లోనే 60వేల ట్వీట్లను సొంతం చేసుకుంది. దటీజ్ బాలయ్య అని ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. అయితే ఈ బర్త్ డే వేడుకలతో పాటుగా షష్టి పూర్తిని కూడా జరుపుకోవాలని బాలయ్య భావిస్తున్నాడట. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. కోవిడ్ నిబంధనలకు లోబడే ఈ వేడుకలను నిర్వహిస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











