Happy birthday balakrishna: ఏడుగురిలో ఒక్క మగాడు.. చిన్న వయసులోనే ట్రెండ్ సెట్

టాలీవుడ్ యువ రత్న, నట రత్న అంటూ అనేక రకాల ముద్దు పేర్లతో అభిమానులకు మరింత దగ్గరైన నటుడు నందమూరి బాలకృష్ణ. నేటితో 60ఏళ్ళ వసంతంలోకి అడుగు పెట్టిన బాలయ్య ఇంకా తన వయసు ఆరు మాత్రమే అంటూ మంచి ఎనర్జీతో కనిపిస్తున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ మొన్నటి వరకు గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూలు ఇచ్చి అభిమానుల గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. ఇక ఆయన కెరీర్ పై ఒక లుక్కేస్తే..

ఏడుగురిలో ఒక్కడు..

ఏడుగురిలో ఒక్కడు..

నందమూరి తారక రామారావు తరువాత నటనపరంగా ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో బాలకృష్ణ పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ కి ఏడుగురు కొడుకులు. యాక్టింగ్ పరంగా ఏ ఒక్కరు క్లిక్కవ్వలేదు. కానీ ఆరవ పుత్రుడు బాలయ్య మాత్రం ఎన్టీఆర్ వంశ వృక్షానికి మరో బీజం వేశారు. నటుడిగా తనకంటూ ఒక క్రేజ్ అందుకున్నారు.

 14 ఏళ్లకే వెండితెరపై..

14 ఏళ్లకే వెండితెరపై..

సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మ కల అనే సినిమా ద్వారా బాలయ్య సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఫైనల్ గా తన కొడుకుతో ఒక మంచి నటుడు ఉన్నాడని గుర్తించిన ఎన్టీఆర్ ఆ తర్వాత బాలయ్య కోసం కొన్ని సినిమాలు రూపొందించారు. ఓ వైపు ఎడ్యుకేషన్ పూర్తి చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తూ వచ్చాడు. హైదరాబాద్ నిజాం కాలేజ్ లోనే బాలకృష్ణ డిగ్రీ పూర్తి చేశారు.

పాతికేళ్ల వయసులోనే..

పాతికేళ్ల వయసులోనే..

పాతికేళ్ల వయసులోనే బాలకృష్ణ బాక్సాఫీస్ ట్రెండ్ సెట్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పట్లో మంగమ్మ గారి మనవడు, ముద్దుల మామయ్య వంటి సినిమాలతో టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు. అలాగే ఆదిత్య 369 అంటూ మొట్ట మొదటి తెలుగు టైమ్ ట్రావెల్ సినిమాను చేశాడు. బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో 100 సినిమాలను పూర్తి చేసిన విషయం తెలిసిందే. అందులో విజయాలతో పాటు డిజాస్టర్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు.

 కమర్షియల్ స్టైల్..

కమర్షియల్ స్టైల్..

నేటితరం హీరోలు డిఫరెంట్ గా చేయకపోతే వర్కౌట్ కాదు. అయితే బాలకృష్ణ మాత్రం తన మాస్ స్టైల్ లోనే కమర్షియల్ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకరిస్తున్నారు. బాలయ్య నుంచి మాస్ డైలాగ్స్ పడకపోతే ఆభిమానులు ఒప్పుకోరు. అభిమానులను దృష్టిలో ఉంచుకొని అలాగే తన స్టైల్ ఏ మాత్రం మిస్ కాకుండా బాలకృష్ణ 40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో రారాజుగా ఎదుగుతున్నాడు.

ఇంకా 60ఏళ్లయినా..

ఇంకా 60ఏళ్లయినా..

వయసు పెరుగుతున్న కొద్దీ బాలకృష్ణలో ఆ ఎనర్జి ఏమాత్రం తగ్గడం లేదు. ఫైనల్ గా 60వ పుట్టినరోజు జరుపుకోబోతున్న బాలకృష్ణకు అభిమానుల నుంచి కోట్లాది శుభాకాంక్షలు అందుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాలకృష్ణకు సంబంధించిన స్పెషల్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇంకా 60 ఏళ్లయినా ఇలానే ఉంటానని ఇటీవల బాలయ్య చెప్పిన తీరుకు ఆభిమానులు ఫిదా అవుతున్నారు.

Recommended Video

Sri Reddy Wishes Balakrishna & Slams Mega Family, Post Gone Viral
పాలిటిక్స్..

పాలిటిక్స్..

ప్రజాసేవలో కూడా బాలకృష్ణకు మంచి గుర్తింపే దక్కింది. తల్లి బసవతారకం పేరుతో క్యాన్సర్ పేషేంట్స్ కి వైద్యం అందిస్తున్నారు. హిందూపురం ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమని బాలయ్య నిత్యం చెబుతూనే ఉంటారు. తండ్రి గెలిచిన ఆ స్థానాన్ని ఇంకా అదే బాటలో నడిపిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ కోసం ఎలాంటి అడుగులు వేస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X