TFI Fans Cricket League ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో బాలయ్య ఫ్యాన్స్ చిత్తు.. Tiger XI టీమ్ ఎలా గెలిచిందంటే!

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏఎం క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ జట్టు NBK Lions టీమ్‌పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల జట్టు Tigers XI టీమ్ ఘన విజయం సాధించింది. 97 పరుగుల సులభ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ జట్టు సునాయసంగా విజయాన్ని సొంతం చేసుకొన్నది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

Recommended Video

TFI Fans Cricket League Jr NTR Tigers XI ఎలా గెలిచిందంటే | Telugu Filmibeat

NBK Lions జట్టుతో జరిగిన మ్యాచ్‌లో Tigers XI జట్టు టాస్ గెలిచి ఫీల్టింగ్ ఎంచుకొన్నది. దాంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. ఎన్టీఆర్ జట్టు సభ్యులు పకడ్బందీగా బౌలింగ్ చేయడంతో బాలయ్య టీమ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఈ జట్టు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్ల కంటే ముందుగానే 18.5 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది.

Nandamuri Balakrishna

TFI Fans Cricket League నాగార్జున ఫ్యాన్స్ జట్టుపై మహేష్ టీమ్ విజయం.. సెంచరీ చేసినా ఫలితం దక్కని..!
https://telugu.filmibeat.com/news/tfi-fans-cricket-league-mahesh-babu-global-trotters-won-over-nagarjuna-akkineni-nag-kings-team-132223.html

NBK Lions జట్టులో అత్యధికంగా శ్రీను 29 పరుగులు, ధీరజ్ 15 పరుగులు, రిస్క్ అజయ్ 17 పరుగులు చేశారు. మిగితా వారందరూ సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. Tigers XI జట్టులో అత్యధికంగా తరుణ్ 3 వికెట్లు, క్విన్ష్ 2 వికెట్లు, నీరజ్ 2 వికెట్లు, సిద్దూ, హర్ష, ఏవీఆర్ చెరో వికెట్ సాధించారు.

TFI Fans Cricket League: నితిన్ ఫ్యాన్స్ జట్టు విజృంభణ.. కుప్పకూలిన రవితేజ ఫ్యాన్స్ టీమ్!

https://telugu.filmibeat.com/specials/nithin-fans-team-won-over-ravi-tejas-team-eagle-in-tfi-fans-cricket-league-132233.html

ఇక 97 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన Tigers XI జట్టు ధాటిగా ఆడింది. ఓపెనర్లు తెగడ, ఏవీఆర్ రాణించడంతో గెలుపు సులభమైంది. ఏవీఆర్ 51 పరుగులు, తేగడ 14 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య కిరణ్ 25 పరుగులతో, సిద్దూ నాయక్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. NBK Lions జట్టులో విక్రాంత్ రాజ్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ జట్టుకు తొలి విజయం లభించింది.

TFI Fans Cricket League జై చిరంజీవ జట్టు ఘన విజయం.. లక్ష్యం ముందు రవితేజ ఫ్యాన్స్‌ బోల్తా.. టార్గెట్ ఎంతంటే?
https://telugu.filmibeat.com/specials/tfi-fans-cricket-league-jai-chiranjeeva-team-won-on-team-eagle-by-59-runs-in-hyderabad-132239.html

ఇదిలా ఉండగా, జనవరి 31 తేదీన తమ్ముడు XI జట్టుతో జై చిరంజీవ జట్టు, హంగ్రీ చీటా జట్టుతో NBK Fans, రోరింగ్ రెబెల్స్‌తో నాగ్ కింగ్స్, గేమ్ ఛేంజర్ జట్టుతో వెంకీ వారియర్స్ జట్టు తలపడుతాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 వరకు ఈ మ్యాచ్‌లు కొనసాగుతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X