బాలయ్యను అంకుల్ అనేశాడు.. ఆ మాటకు కంటిచూపుతోనే బెదిరించాడు!!
తెలుగు చిత్ర సీమలో హీరోలకు వయసు అనేది ఉండదు. ఆరుపదుల వయసు దాటినా వారింకా కుర్ర హీరోల కిందే లెక్క. వారిని అభిమానులు, జనాలు కూడా అలానే చూస్తారు. బాబులు, మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటూ ఉన్నా కూడా వారింకా యంగ్ ఏజ్‌లోనే ఉన్నట్టు ఫీలవుతారు. అలాగే కనిపించేందుకు ఆసక్తిని చూపిస్తారు. పైగా సీనియర్ హీరోలను ఇంకా బాబు అనే పిలుస్తాంటారు జనాలు. అందులో ముందుగా వినిపించే పేరు బాలకృష్ణ. ఇంకా బాలకృష్ణను బాలయ్యబాబు అంటుంటారు. కానీ తాజాగా కుర్రాడు మాత్రం నోరు జారేశాడు. అది కూడా అందరి ముందే. దీంతో బాలయ్య కన్నెర్ర చేశాడు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

సెహరీ ఈవెంట్‌లో...
మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు నిర్మిస్తున్న సెహరి అనే సినిమా ఫంక్షన్‌కు నందమూరి బాలకృష్ణ హాజరయ్యాడు. ఇక ఇలాంటి ఈవెంట్లలో బాలయ్య ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో.. అక్కడ సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బాలయ్య అరవడం, ఆ స్పీచ్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతుందన్న సంగతి తెలిసిందే. అలాగే సెహరీ ఈవెంట్‌లో బాలయ్య చేసిన రచ్చ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

అసహనం..
సెహరీ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు బాలయ్య స్టేజ్ మీదకు ఎక్కాడు. ఆ సమయంలో ఫోన్ వచ్చినట్టుంది. పాకెట్‌లోంచి తీసి అలా చూసి అవతలకు విసిరి పారేశాడు. దీంతో ఆ స్టేజ్ మీదున్న కుర్ర హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతలందరూ షాక్ అయ్యారు.

బాలయ్య స్పీచ్..
ఆ తరువాత బాలయ్య మాట్లాడుతూ.. నిర్మాత, హీరో నా దగ్గరికి వచ్చాడు. ఆప్పుడు డైరెక్టర్ రాలేదు. ఆ ఇద్దరే నాకు కథ మొత్తం వినిపించారు. నేను అడిగి మరీ చెప్పించుకున్నాను. వారికి కొన్ని సలహాలు ఇచ్చాను. మరీ ముఖ్యంగా సినిమా రెండు గంటలకంటే ఎక్కువగా ఉండొద్దని సలహా ఇచ్చాను అని పేర్కొన్నాడు. మధ్య మధ్యలో వర్జిన్, హీరో బర్త్ డే అంటూ ఇలా ఏవేవో సెటైర్లు వేశాడు.

హడావిడిగా..
అలాగే ఫస్ట్ లుక్ ఆవిష్కరించే సమయంలోనూ బాలయ్య హడావిడిగా దాన్ని చించిపడేశాడు. అది చివర్లో అలాగే ఉండటంతో దాన్ని తీసేద్దామని హీరో హర్ష ప్రయత్నించాడు. కానీ బాలయ్య ఆ కుర్ర హీరోను తీసి అవతలకు నెట్టేశాడు. ఇలాంటి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ఈ ఈవెంట్‌లో జరిగాయి.
Recommended Video

బాలయ్య అంకుల్..
సెహరి దర్శకుడు మాట్లాడుతూ బాలయ్యపై చేసిన కామెంట్లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. పిలవగానే వచ్చారు థ్యాంక్స్ అంకుల్ అని కుర్ర దర్శకుడు అనేశాడు. ఆ మాటతో బాలయ్య ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో జారిన ఆ మాటన వెనక్కి తీసుకుంటూ.. థ్యాంక్స్ బాలయ్య బాబు అనేశాడు. మొత్తానికి బాలయ్య అంకుల్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











