మెగా ఫ్యాన్స్‌కు భారీ షాకిచ్చిన బాలకృష్ణ.. చిరంజీవి ఇక నిర్ణయం మార్చుకోవాల్సిందే.!
దాదాపు నలభై ఐదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవా చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ నట వారసుడిగా పరిచయమైనప్పటికీ... యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ అద్భుతంగా పండిస్తూ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఇక, జయాపజయాలకు సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మెగా ఫ్యాన్స్‌కు భారీ షాక్ ఇచ్చారు. దీంతో చిరంజీవి తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే..

బాలయ్యకు భారీ దెబ్బలు.. అందుకే ఇలా
2019వ సంవత్సరం నందమూరి బాలకృష్ణకు అస్సలు కలిసిరాలేదు. దీనికి కారణం.. గత ఏడాది ఆయన మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. అవన్నీ బాక్సాఫీస్ ముందు దారుణమైన పరాజయాలను మూటగట్టుకున్నాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలనే పట్టుదలతో ఉన్న ఆయన.. బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు.

మొదటి గర్జన అదిరింది.. పరిస్థితి మారింది
‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్ల తర్వాత బోయపాటి - బాలయ్య మరోసారి కలిశారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంతగా అంచనాలు లేవు. కానీ, రెండు రోజుల క్రితం విడుదలైన టీజర్ భారీ స్థాయిలో వ్యూస్ రాబట్టడంతో పాటు పలు రికార్డులు బద్దలు కొట్టేసింది. దీంతో నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్ మొదలు
ఇటీవల నందమూరి బాలకృష్ణ.. చిరంజీవిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సినీ ఇండస్ట్రీలోని పెద్దల ఆ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. దీని గురించి తనకు తెలియదన్న బాలయ్య.. ‘అంతా కలిసి భూములు పంచుకుంటున్నారా' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానులు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

పట్టించుకోని చిరు.. మా బాలయ్య అంటూ
బాలకృష్ణ తనపై ఘాటు విమర్శలు చేశారన్న విషయం తెలిసినా.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం వాటిని లైట్ తీసుకున్నారు. అందుకే నటసింహా పుట్టినరోజున ఆయన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అంతేకాదు, ‘మా బాలయ్య అనుకున్నది జరగాలి' అంటూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. దీంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ కొంచెం చల్లబడ్డారు.

మెగా ఫ్యాన్స్‌కు భారీ షాకిచ్చిన బాలకృష్ణ
బాలయ్య చేసిన వ్యాఖ్యల ప్రభావం చిత్ర సీమలో ఇంకా కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు కొందరు మద్దతు కూడా ప్రకటించారు. దీంతో టాలీవుడ్‌లో కోల్డ్ వార్ కొనసాగుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ అనుకోకుండా చేసిన ఓ పని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు, మెగా ఫ్యాన్స్ షాకయ్యేలా చేసింది.

చిరంజీవి ఇక నిర్ణయం మార్చుకోవాల్సిందే.!
‘లూసీఫర్' మూవీలో మోహన్ లాల్ పంచె కట్టు, ఖద్దరు చొక్కాతో కనిపిస్తాడు. దీంతో తెలుగు రీమేక్‌లో చిరంజీవి కూడా అంతే స్టైలిష్‌గా ఉంటాడని మెగా ఫ్యాన్స్‌తో పాటు అందరూ భావించారు. కానీ, బోయపాటి సినిమాలో బాలయ్య కూడా మోహన్ లాల్ గెటప్‌తోనే దర్శనమిచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి చేయబోయే రీమేక్‌లో గెటప్‌ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Recommended Video

చిరు సినిమాలో పవన్, వరుణ్, రాములమ్మ
మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘లూసీఫర్'. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమానే తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్ కీలక పాత్రలు చేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, విజయశాంతి.. చిరంజీవి సోదరిగా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











