మోక్షజ్ఞ ఎంట్రీపై సెన్సేషనల్ న్యూస్ లీక్: కొడుకు కోసం బాలయ్య స్పెషల్ టీమ్ రెడీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కొత్తేం కాదు. అప్పటి అగ్ర హీరోల నుంచి ఇప్పటి చిన్న నటుల వరకు ఎంతో మంది తమ వారసులను చిత్ర సీమకు పరిచయం చేశారు. మరికొందరు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ జాబితాలోకే వస్తాడు నందమూరి వంశానికి చెందిన మరో వారసుడు మోక్షజ్ఞ. నటసింహా నందమూరి బాలకృష్ణ కుమారుడైన ఈ కుర్రాడు.. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అతడి ఎంట్రీ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడే... మిస్ అయిందిగా
నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతాడని బాలకృష్ణ ఎప్పుడో ప్రకటించాడు. దీంతో ఆయన నటించిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి'లోనే కొడుకును ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, అందులో మోక్షూ కనిపించలేదు. ఆ తర్వాత కూడా అతడి సినీరంగ ప్రవేశంపై ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.

లుక్ బయటకు.. ఫ్యాన్స్‌లో పెరిగిన నిరాశ
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఎప్పుడైతే ప్రకటన చేశాడో... అప్పటి నుంచి నందమూరి అభిమానులు అతడి రాక గురించి వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నందమూరి కుర్రాడి ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో మోక్షజ్ఞ చాలా లావుగా కనిపించాడు. అలాగే లుక్ కూడా ఆకట్టుకునేలా అనిపించలేదు. దీంతో ఫ్యాన్స్‌లో నిరాశ పెరిగిపోయింది.

మోక్షజ్ఞను పరిచయం చేస్తానన్న డైరెక్టర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతోన్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ హిట్ కావడంతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందాడు. ఇదిలాఉండగా... ఈ డైరెక్టర్ నందమూరి మోక్షజ్ఞను టాలీవుడ్‌కు పరిచయం చేస్తానని బాలయ్యతో చర్చలు జరిపినట్లు, అందుకోసం ఓ కథనూ సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మోక్షజ్ఞ కోసం రాజమౌళి అదిరిపోయే ప్లాన్
చాలా రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మోక్షజ్ఞ పేరు మారుమ్రోగిపోతోంది. దీనికి కారణం అతడి ఎంట్రీ గురించి వార్తలు వస్తుండడమే. అంతేకాదు, ఈ నందమూరి కుర్రాడిని రాజమౌళి దగ్గరుండి మరీ లాంచ్ చేయబోతున్నాడని ప్రచారం జరగడం కూడా. అవును... జక్కన్న దగ్గర దర్శకత్వ శాఖలో పని చేస్తున్న ఓ యంగ్ డైరెక్టర్ మోక్షజ్ఞతో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీపై సెన్సేషనల్ న్యూస్ లీక్
నందమూరి బాలకృష్ణ కుమారుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అతడి ఎంట్రీ గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మోక్షూ ఎంట్రీ కన్ఫార్మ్ అయిందని ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది.

కొడుకు కోసం బాలయ్య స్పెషల్ టీమ్ రెడీ
మోక్షజ్ఞను త్వరలోనే చిత్రసీమకు పరిచయం చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు బాలయ్య. ఇందులో భాగంగానే అతడి లుక్ కోసం కొందరు ట్రైనర్లను, నటనను నేర్పేందుకు కొందరు గురువులను రప్పించాడట నటసింహం. అంతేకాదు, మిగిలిన విభాగాల్లోనూ శిక్షణ ఇప్పించేందుకు కొందరు నిపుణులతో కూడిన టీమ్‌ను రెడీ చేయించాడని ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
Recommended Video

హ్యాట్రిక్ కోసం బాలయ్య ప్లాన్.. భారీ రెస్పాన్స్
ఇక, వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలయ్య... ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే తనకు గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి హిట్లను ఇచ్చిన బోయపాటితో జత కట్టాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ కొద్ది రోజుల క్రితం విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన సంగతి విధితమే.


Click it and Unblock the Notifications











