twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి వారసుడి క్రేజ్ చూస్తే షాక్.. ఇండియాలో టాప్ ట్రెండ్.. భార్గవ్ రామ్ బర్త్ డే వైరల్

    |

    సెలెబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. వారి పిల్లలకు కూడా అంతే ఫాలోయింగ్ క్రేజ్ ఉంటుంది. మన టాలీవుడ్‌లో సితార, గౌతమ్, అల్లు అర్హ, అల్లు అయాన్, అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరికి సోషల్ మీడియాలో వారి తండ్రికి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు వీడియోలు, పోస్ట్‌లు ఎంతగా హల్చల్ చేస్తాయో..సితార, గౌతమ్‌ల వీడియోలు అంతగా వైరల్ అవుతుంటాయి. ఇక అల్లు ఫ్యామిలీ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    పిల్లలపై ప్రత్యేక శ్రద్ద..

    పిల్లలపై ప్రత్యేక శ్రద్ద..

    స్టార్స్ కిడ్స్ తమ పిల్లలపై ఇప్పటి నుంచే ఫోకస్ ఏర్పడేలా చేస్తున్నారు. అందుకు తమ పిల్లలను సోషల్ మీడియా ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు. వారు చేసే చిలిపి అల్లరి, ముద్దు ముద్దు మాటలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనకే ఉంటాడు.

    సందర్భం ఉంటే తప్పా..

    సందర్భం ఉంటే తప్పా..

    ఎన్టీఆర్ తన ఫ్యామిలీ విషయాలను, ఫోటోలను ఎక్కువగా షేర్ చేయడు. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే తప్పా.. వారి గురించి ఏ విషయాన్ని ప్రకటించడు. పెద్ద కుమారుడు అభయ్ రామ్ బర్త్ డే సందర్భంగా పిక్స్ షేర్ చేస్తూ ట్వీట్ చేస్తాడు. చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌ పుట్టినప్పుడు, పేరు పెట్టినప్పుడు మాత్రమే అభిమానులకు చూపించాడు.

    పిల్లల పిక్స్ వైరల్..

    పిల్లల పిక్స్ వైరల్..

    ఎన్టీఆర్ షేర్ చేసిన రెండు మూడు సందర్భాల్లోనే అభయ్ రామ్, భార్గవ్ రామ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభయ్ రామ్ గురించి చెబుతూ.. మురిసిపోయిన ఎన్టీఆర్ ఫోటోలు అప్పట్లో తెగ హల్చల్ చేశాయి. నేడు చిన్న కుమారుడు భార్గవ్ రామ్ పుట్టిన రోజు.

     రామ్ చరణ్‌ను వెనక్కి నెట్టి..

    రామ్ చరణ్‌ను వెనక్కి నెట్టి..

    భార్గవ్ రామ్ బర్త్ డే ( జూన్ 14) నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్-ఉపాసన పెళ్లి రోజు కంటే భార్గవ్ రామ్ బర్త్ డేనే ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్‌లో #HBDBhargavaRam అనే హ్యాష్ ట్యాగ్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఎన్టీఆర్, భార్గవ్ రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

    Recommended Video

    Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
    పిల్లల బర్త్ డే ట్రెండ్..

    పిల్లల బర్త్ డే ట్రెండ్..

    ఈ మధ్య సెలెబ్రిటీల పిల్లల పుట్టినరోజును అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. అకీరా నందన్ బర్త్ డే విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ తమ సత్తాను చాటుతున్నారు.

    English summary
    Nandamuri Fans Trending Bhargava Ram Birthday In Twitter. Ram Charan Upasana Marriage Anniversary Is Also Trending. Both Hashtags Goes viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X