twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిస్తోన్న నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్: సినిమాల్లోకి ఎంట్రీపై క్లారిటీ.. అందుకే అలా అయిపోయాడా!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కొన్నేళ్లుగా చర్చనీయాంశం అవుతోన్న అంశాల్లో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం ఒకటి. ఈ కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని దాదాపు ఐదేళ్లుగా ప్రచారం జరుగుతోండడమే ఈ పరిస్థితికి కారణం. నిజానికి ఈ నందమూరి వారసుడి పరిచయం ఎప్పుడో ఉంటుందని అనుకున్నప్పటికీ.. దానికి సంబంధించిన ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. మరోవైపు బాలయ్య కూడా తన కొడుకు వస్తున్నాడని చెబుతున్నా.. ఎప్పుడో వెల్లడించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మోక్షజ్ఞ తాజా ఫొటోలు షాకిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే...

    బాలయ్య చెప్పడంతో ఫ్యాన్స్ ఎదురు చూపు

    బాలయ్య చెప్పడంతో ఫ్యాన్స్ ఎదురు చూపు

    నందమూరి కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు. వారిలో పలువురు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా లాంఛ్ అవుతాడని బాలయ్య కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ కుర్రాడి రాక కోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

    బయటికొచ్చిన ఫొటోలు.. భయపడిపోయారు

    బయటికొచ్చిన ఫొటోలు.. భయపడిపోయారు

    కొన్నేళ్ల క్రితం నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. బాలకృష్ణ కుటుంబం అంతా ఓ ఆలయంలో పూజలు చేయించుకున్న సమయంలో తీసిన ఫొటోలవి. వీటిలో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండడంతో అవి చూసిన వారందరూ షాక్‌కు గురయ్యారు. దీంతో అతడు సినిమాల్లోకి రావడం కష్టమేనన్న టాక్ బాగా వినిపించిన విషయం తెలిసిందే.

    కొడుకు కోసం బాలయ్య ప్లాన్.. వాళ్లను దించి

    కొడుకు కోసం బాలయ్య ప్లాన్.. వాళ్లను దించి

    చాలా మంది వారసులు ఒక్కొక్కరుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండడంతో మోక్షజ్ఞను త్వరలోనే చిత్రసీమకు పరిచయం చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు బాలయ్య. ఇందులో భాగంగానే అతడి లుక్‌ను మార్చేందుకు పర్సనల్ ట్రైనర్లను, నటనను నేర్పేందుకు కొందరు గురువులను ఇప్పటికే తీసుకొచ్చాడు బాలయ్య. అంతేకాదు, మిగిలిన విభాగాల కోసం ఓ టీమ్‌ను రెడీ చేసి పెట్టాడాయన.

    రాజమౌళి చేతిలో మోక్షజ్ఞ లాంచింగ్ బాధ్యత

    రాజమౌళి చేతిలో మోక్షజ్ఞ లాంచింగ్ బాధ్యత

    నందమూరి మోక్షజ్ఞను చిత్ర సీమకు పరిచయం చేసే బాధ్యతను బాలకృష్ణ.. దర్శకధీరుడు రాజమౌళి చేతిలో పెట్టాడని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు.. తన శిష్యుడితో అతడిని లాంచ్ చేయాలని జక్కన్న కూడా భావించినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారనే టాక్ కూడా వినిపించింది.

    రేసులోకి డాషింగ్ డైరెక్టర్.. ముగిసిన చర్చలు

    రేసులోకి డాషింగ్ డైరెక్టర్.. ముగిసిన చర్చలు

    ఇక, ఇటీవల మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మరో న్యూస్ వైరల్ అయింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. అతడి మొదటి సినిమాను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించబోతున్నాడనేదే దాని సారాంశం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని కూడా అన్నారు. 2021 చివర్లో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

    షాకిస్తోన్న నందమూరి మోక్షజ్ఞ సరికొత్త లుక్

    షాకిస్తోన్న నందమూరి మోక్షజ్ఞ సరికొత్త లుక్

    నందమూరి బాలకృష్ణ కుమార్తలైన బ్రాహ్మణీ, తేజస్విని కుమారులకు బాసరలో అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమం మేనమామ అయిన మోక్షజ్ఞ చేతుల మీదుగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇందులో బాలయ్య వారసుడు గతంలో మాదిరిగా కాకుండా సన్నగా అయి దర్శనమిచ్చాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    ఎంట్రీపై క్లారిటీ.. అందుకే అలా అయిపోయాడా

    ఎంట్రీపై క్లారిటీ.. అందుకే అలా అయిపోయాడా

    గతంలో ఎంతో బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ.. తాజా ఫొటోల్లో సన్నగా ఉండడంతో సినిమాల కోసమే అతడు బరువు తగ్గాడన్న టాక్ వినిపిస్తోంది. అలాగే, లుక్ విషయంలోనూ చాలా తేడా కనిపిస్తోంది. పర్సనల్ ట్రైనర్ల వల్లే ఇలా మారాడని అంటున్నారు. మొత్తానికి ఈ ఫొటోల వల్ల మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం వేగం పుంజుకుందని ఇండస్ట్రీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

    English summary
    Nandamuri Mokshagna well trained in action and dance. He is going to raise or gear his father following soon. Currently, he is in the USA and pursuing his Management Course. After completion of his entire studies, he will quickly...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X