Taraka Ratna 9 Number: తారకరత్నకు కలిసి రాని 9 నెంబర్.. గుండెపోటు, కన్నుమూత ఇలా ఏది చూసుకున్నా!
నందమూరి తారకరత్న ఇక లేరు. జనవరి 27న గుండెపోటుకు గురు అయిన ఆయన బెంగళూరులోని నారాయణ హృదాయలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 23 రోజుల సుధీర్ఘ పోరాటం తర్వాత తుది శ్వాస విడిచి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఎప్పటికైనా పూర్తి ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆశించిన కుటుంబ సభ్యులు, అభిమానులను తీవ్ర శోకసంద్రలోకి నెట్టివేశారు.
సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న తారక రత్న రాజకీయాల్లోకి అడుగు పెట్టి ప్రజలకు సేవ చేద్దామన్న చివరి కోరిక నెరవేరకుండానే మృత్యు ఒడిలోకి జారుకున్నారు. అయితే ఆయన 2002లో ఒకే రోజు 9 సినిమాలను లాంచ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. కానీ అప్పటి నుంచే తారకరత్నకు 9వ నెంబర్ కలిసి రాలేదు.

ఉత్తమ విలనిజానికి..
ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి హీరో తారకరత్న తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చేసిన సినిమాల్లో హీరోగా పెద్దగా రాణించలేకపోయినా ప్రతినాయకుడిగా మాత్రం అలరించారు తారకరత్న. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అమరావతి సినిమాలో ఆయన విలనిజానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.

యువగళం పాదయాత్రలో..
నందమూరి తారకరత్న ఎంతగా ప్రయత్నించినప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్ లు పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ప్రజా సేవకోసం కృషి చేద్దామన్న ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావించారు. ఇలా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో తన బావ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురయ్యారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేర్పించిన విషయం తెలిసిందే.

శోకసంద్రంలో సినీ పరిశ్రమ..
బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో విదేశీయి వైద్యుల సహకారం, ఇతర మెరుగైన సేవలతో చికిత్స పొందిన తారకరత్న శనివారం (ఫిబ్రవరి 18) కన్నుమూశారు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. తారకరత్న మరణవార్తతో నందమూరి వంశంలోనే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన చనిపోయారన్న వార్తతో నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.

ఏకంగా తొమ్మిది సినిమాలతో..
ఇదిలా ఉంటే సాధారణంగా న్యూమరాలజీలో 9 నెంబర్ ఉంటే అదృష్టం అంటారు. కానీ ఆ లక్కీ నెంబర్ నందమూరి తారకరత్నకు మాత్రం ఏమాత్రం కలిసి రాలేదని ఫిల్మ్ నగరాల్లో ఒక టాక్ నడుస్తోంది. అందుకు పలు కారణాలు, సంఘటనలు అద్దం పడుతున్నాయి. తారకరత్న 2002లో హీరోగా తెరంగేట్రం చేశారు. హీరోగా ఎంట్రీ ఇస్తూనే ఏకంగా తొమ్మిది సినిమాలను లాంచ్ చేసి రికార్డ్ సృష్టించడమే కాకుండా ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు.

హీరోగా రాణించలేక..
అయితే ఒకే రోజు 9 సినిమాలు స్టార్ట్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినప్పటికీ అందులో కేవలం 4 సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి. మిగతా 6 సినిమాలు షూటింగ్ కూడా జరగకుండానే ఆగిపోయాయి. ఆ విధంగా తారకరత్న జీవితంలో 9 సినిమాలు లాంచ్ చేసినప్పటికీ ఒక మచ్చగా మిగిలిపోయింది. ఒకటో నెంబర్ కుర్రాడు తర్వాత సినిమాల్లో హీరోగా రాణించలేకపోయిన తారకరత్న విలన్ గా ఆకట్టుకుని అమరావతి సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు.

కలిసిరాని జనవరి 27..
సినిమాలకు చాలా కాలం గ్యాప్ ఇచ్చిన నందమూరి తారకరత్న 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి పర్వాలేదనిపించుకున్న పెద్దగా సక్సెస్ మాత్రం కాలేకపోయింది. దీంతో కూడా ఆయన పెద్దగా క్లిక్ అయింది లేదు. ఇది కూడా 9 నెంబర్ తోనే ఉండటం గమనార్హం. ఇక రాజకీయాల్లోకి అడుగులు వేద్దాం అన్న ఆలోచనతో.. ఏపీలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అలా ప్రారంభించిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురయ్యారు. ఆ రోజు జనవరి 27. అంటే 2+7=9. మరోసారి 9 కలిసి రాలేదు.

మళ్లీ ప్రభావం చూపిన 9 నెంబర్..
ఇక గుండెపోటుకు గురైన తారకరత్నకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత 23 రోజులుగా అనుభజ్ఞులైన వైద్య బృందం చికిత్స అందించారు. కానీ దురదృష్టవశాత్తు మృత్యువుతో పోరాడు చివరికి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. 18 తేది అంటే 1+8=9. మరోసారి 9 నెంబర్ వచ్చింది. ఇలా మళ్లీ తారకరత్న జీవితంలో ప్రభావం చూపించిన 9వ నెంబర్ ఏమాత్రం కలిసిరాలేదు. ఈ సంఘటనల దృష్ట్యా తారకరత్నకు 9 నెంబర్ అస్సలు కలిసి రాలేదు అని ఫిల్మ్ నగరాల్లో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications











