Taraka Ratna భుజంపై సీక్రెట్ టాటూ.. స్టార్ హీరో అటో గ్రాఫ్.. ఆయన ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో వరుసగా జరుగుతున్న విషదాలు కలవరం తెప్పిస్తున్నాయ. ఇప్పటికే దిగ్గజ దర్శకులు, గాయనీగాయకులు తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయారు. తాజాగా శనివారం రోజున గుండెపోటు ద్వారా ఆస్పత్రి పాలైన హీరో, విలన్, టీడీపీ నేత నందమూరి తారకరత్న కన్నుమాశారు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన తారకరత్న 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో చివరిగా కనిపించారు.

ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టి తనవంతు సేవ చేద్దామనుకునే క్రమంలో యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయి.. చివరిగా మృత్యు ఒడిలోకి చేరారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తారకరత్న భుజంపై ఉన్న ఒక స్పెషల్ టాటూ చర్చనీయాంశమైంది.

భూమిక ప్రధాన పాత్రలో..

భూమిక ప్రధాన పాత్రలో..

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు చిత్రసీమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు నందమూరి తారకరత్న. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్ గానూ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోలేని తారకరత్న విలన్ గా కూడా నటించాడు. అంతేకాకుండా భూమిక ప్రధాన పాత్ర పోషించిన అమరావతి సినిమాలో విలనిజానికి నంది అవార్డు అందుకున్నారు.

హీరోగా, విలన్ గా..

హీరోగా, విలన్ గా..

నారా రోహిత్ హీరోగా నటించిన రాజా చేయి వేస్తే సినిమాలో కూడా విలన్ గా నటించారు తారకరత్న. ఇలా హీరోగా, విలన్ గా సుమారు 23 చిత్రాల్లో నటించారు నందమూరి తారకరత్న. మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా.. ఇటీవల జరిగిన కుప్పంలోని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సమయంలోనే కుప్పకూలిన తారకరత్నకు గుండెపోటు అని వైద్యులు నిర్ధరించగా.. బెంగళూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

హైదరాబాద్ కు తారకరత్న భౌతికకాయం..

అయితే 23 రోజులుగా మృత్యువుతో పోరాడి శనివారం కన్నుమూశారు. ఇవాళ అంటే ఆదివారం (ఫిబ్రవరి 19) నాడు ఆయన భౌతిక కాయం హైదరాబాద్ కు చేరుకుంది. గత రాత్రి బయలు దేరిన అంబులెన్స్ నేడు రంగారెడ్డి జిల్లాలోని మోకిలాలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. తారకరత్నను చివరిసారిగా చూసేందుకు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు.

సోమవారం ఉదయం అంటే ఫిబ్రవరి 20న ఫిలీం నగర్ లోని ఫిలీం చాంబర్ కు తరలించి సాయంత్ర నాలుగు గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

టాటూగా సింహం బొమ్మ.. ఎందుకంటే..

టాటూగా సింహం బొమ్మ.. ఎందుకంటే..

ఇదిలా ఉంటే ప్రస్తుతం తారక రత్న భుజంపై ఉన్న స్పెషల్ టాటూపై చర్చ నడుస్తోంది. ఒక సింహం బొమ్మను టాటూగా వేయించుకున్నారు నందమూరి తారకరత్న. అయితే అలా పర్టిక్యూలర్ గా సింహం బొమ్మను టాటూగా వేయించుకోవడానికి కారణం నందమూరి బాలకృష్ణ.

ఆయనపై ఉన్న అభిమానం, ప్రేమతో నందమూరి నటసింహం అయిన బాలయ్య బాబుకు గుర్తుగా అలా టాటూ వేయించుకున్నారట. అంతేకాకుండా దానిపై బాలకృష్ణ అటోగ్రాఫ్ కూడా పచ్చబొట్టుగా ఉంటుంది.

అన్నీ తానై..

అన్నీ తానై..

బాబాయ్ పై తారకరత్నకు ఉన్న అనుబంధానికి నిర్వచనంగా సింహం బొమ్మతోపాటు బాలయ్య అటోగ్రాఫ్ ను పచ్చబొట్టుగా వేసుకున్నారు. ప్రస్తుతం ఈ టాటూ పిక్ వైరల్ అవుతోంది. అలాగే తారకరత్న అంటే బాలయ్య బాబు కూడా అమితమైన ప్రేమ. కుప్పంలో తారకరత్నకు స్ట్రోక్ వచ్చినప్పుడు బాలకృష్ణ దగ్గరుండి అన్నీ తానై చూసుకున్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయకు కూడా అక్కడి వైద్యులతో మాట్లాడి షిఫ్ట్ చేయించారు. ప్రత్యేకంగా డాక్టర్స్ ని పిలిపించి చికిత్స ఇప్పించారు.

బాల బాయ్ అంటూ..

బాల బాయ్ అంటూ..

అంతేకాకుండా బాలకృష్ణ ప్రతి సోమవారం ఎక్కడున్నా బెంగళూరుకు వెళ్లి తారకరత్న పరిస్థితిని దగ్గరుండి గమనిస్తూ వచ్చారు. ఇక బాలయ్యను తారకరత్న.. బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచేవారని బాలకృష్ణ తెలిపారు. ఇప్పుడు ఆ పిలుపు వినబడదన్న ఊహను తట్టుకోలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నారు. తారకరత్న మరణం నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తీరని లోటని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X