చెప్పడానికి మాటలు చాలడం లేదు.. ‘ఆకాశం నీ హద్దురా’పై నందినీ రెడ్డి కామెంట్స్
సూర్య హీరోగా నటించిన సూరారై పొట్రూ (ఆకాశం నీ హద్దురా) అనే చిత్రం అనేక వాయిదాల తరువాత ఎట్టకేలకు రేపు (నవంబర్ 12) ఓటీటీలో విడుదల కాబోతోంది. తాజాగా ప్రివ్యూ చూసిన కొంత మంది సెలెబ్రిటీలు ఆకాశం నీ హద్దురా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీ రేపు అమేజాన్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ గురించి నందినీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసింది.
కాసేపటి క్రితమే ఆకాశం నీ హద్దురా మూవీ ప్రివ్యూ చూశాను.. ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేను.. పదాలు కూడా తక్కువ అవుతాయి.. నేను ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను.. ఎంతో స్ఫూర్తిపొందాను.. ఎంతో సంతోషంగా ఉంది.. సూర్య నా ఫేవరేట్ నటుల్లో ఒకరు.. ఎప్పుడూ కూడా కొత్తగా చేస్తారు. కానీ ఈ చిత్రంలో చేసింది మాత్రం ఎంతో బ్యూటీపుల్, బ్రిల్లియంట్‌గా ఉందని నందినీ రెడ్డి ప్రశంసలు కురిపించింది.

సినిమా చూశాకా సుధా కొంగర మాత్రం మనతో ఎప్పటికీ ఉండిపోతుంది.. అపర్ణా బాలమురళీ ఎంతో బాగా నటించింది. ఆమెకు ఈ పాత్ర ఇచ్చినందుకు సుధా కొంగరకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఎంతో గొప్పగా నటించింది. కెప్టెన్ గోపీనాథ్ కథ ఆధారంగా తీసిన ఈసినిమాలో ప్రతీ ఒక్క నటుడు.. ప్రతీ ఒక్క మూమెంట్.. ప్రతీ ఒక్క విషయం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని నందినీ రెడ్డి చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











