రూమర్స్‌కు రేటింగ్.. ఫేక్ న్యూస్‌పై డైరెక్టర్ చురక
అలా మొదలైంది అంటూ డైరెక్టర్‌గా కెరీర్‌ను అలా మొదలెట్టేసింది నందినీ రెడ్డి. అయితే ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మాత్రం ఏర్పరుచుకుంది. మధ్యలో సినిమాలు దారుణంగా బెడిసి కొట్టినా మళ్లీ ఓ బ్లాక్ బస్టర్‌ను కొట్టి.. ఫామ్‌లోనే ఉన్నానని నిరూపించుకుంది. ఈమె తెరపై ఎలా నవ్వులు పూయిస్తుందో, పంచ్‌లు ఎలా పేలుస్తూ ఉంటుందో అందరికీ తెలిసిందే. అదే టైమింగ్‌ను సోషల్ మీడియాలోనూ ప్రదర్శిస్తూ ఉంటుంది.తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఓ సారి చూద్దాం.
రీసెంట్‌గా ఓ బేబీ అంటూ హిట్ కొట్టిన నందినీ రెడ్డి.. ఈ మధ్య ఫేక్ న్యూస్‌పై సెటైర్స్ వేస్తోంది. క్రియేటివిటీని దర్శకులు చూపిస్తారని, మీరు మాత్రం వార్తలు రాయండి, క్రియేటివిటీ చూపించకండని ఆ మధ్య చురకలు అంటించింది. మెగాస్టార్ ముందు తేలిపోయిందని, కథను చెప్పి ఒప్పించలేకపోయిందంటూ వచ్చిన రూమర్లపై నందినీ రెడ్డి కౌంటర్ వేసింది. తాజాగా వచ్చిన మరో రూమర్‌పై ఏకంగా రేటింగ్ కూడా ఇచ్చేసింది.

మళ్లీ సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి విదేశీ కథనే వడ్డిస్తోందని రూమర్స్ వచ్చాయి. వీటిపై స్పందిస్తూ.. 'నా తదుపరి చిత్రం రీమేక్ కాదు.. నా సొంత స్క్రిప్ట్.. అది కూడా స్వప్నా సినిమాస్ నిర్మాణంలో.. మళ్లీ సమంత, నేను కలిసి చేయాలనుకుంటే.. సంతోషంతో, గర్వంతో నేను ప్రకటిస్తాను.. మరో రూమర్‌కు ఎదురు చూస్తుంటాను.. ఈ రూమర్‌కు నా రేటింగ్ 1/5.. ఇంకా మంచి రూమర్లను క్రియేట్ చేయగలరు కమ్ ఆన్..' అంటూ ఫేక్ న్యూస్ రాసేవారిపై సెటైర్లు వేసింది.


Click it and Unblock the Notifications











