నాని లవ్ స్టోరీ.. ఆమె కోసం నాని సాహసం.. ఎలా ప్రేమలో పడ్డారో తెలుసా?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. సినిమా తర్వాత సినిమా హిట్ కొట్టుకుంటూ రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. ఓవైపు హీరోగా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా చక్కటి సినిమాలను నిర్మిస్తున్నారు. చివరగా నానికి సరిపోదా శనివారం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందింది. ఆయన నిర్మించిన రీసెంట్ ఫిలిం కోర్టు కూడా మంచి ఫలితాలను అందించింది. అంత ముందుకు వచ్చిన దసరా, హాయ్ నాన్న వంట సినిమాలు కూడా ఎలాంటి ఫలితాలను అందించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ప్రస్తుతం నాని మోస్ట్ అవైటెడ్ ఫిలిం హిట్ 3 క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మే 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ గ్రాండ్ గా విడుదలైంది. ఆ సినిమాకు సంబంధించిన రివ్యూస్ కూడా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం నాని పేరే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా నానీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన ప్రేమ కథ అద్భుతంగా ఉంటుంది. నాని కూడా పలు సందర్భాల్లో తన లవ్ లైఫ్ గురించి నిర్మొహమాటంగా అభిమానులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే నాని ప్రేమ కథ ఎలా మొదలైంది? మొదటి సారిగా ఎప్పుడు కలిశారు? ఏ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు? అనే విషయాలకు వస్తే... నేచురల్ స్టార్ నాని తన కెరీర్ బిగినింగ్ లో వైజాగ్ లో ఉండేవారు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి ముందు వైజాగ్ లో RJ గా వర్క్ చేశారు. అదే సమయంలో వైజాగ్ కు చెందిన అంజనా యేలవర్తినిని కలిశారు.
మొదట్లో వీరు స్నేహితులుగానే ఉన్నారు. నాని అంజనా తో కలిసి వైజాగ్ బస్సులో తెగ తిరిగేవాడని ఆయనే చెప్పుకొచ్చారు. హైదరాబాద్ కు షిఫ్ట్ అయినాక కూడా అంజనా కోసం హైదరాబాదు నుంచి వైజాగ్ వరకు బస్సులో వెళ్లి మరి కలిసి వచ్చేవాడని చెప్పారు. అలా వారిద్దరు 5 సంవత్సరాల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. 2012లో నాని అంజనను కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎలాంటి ఆడంబరాలు లేకుండా పెళ్లి చేసుకున్నారు. 2012 అక్టోబర్ 27న వీరి మ్యారేజ్ జరిగింది. నాని అంజన దంపతులకు అర్జున్ అనే కొడుకు కూడా ఉన్న సంగతి తెలిసిందే.
నాని ఏమాత్రం సమయం దొరికినా తన కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ఉంటారు. తన కొడుకుతో, కుటుంబ సభ్యులతో సరదాగా ఉన్న వీడియోలను కూడా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని బిగ్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టడంతో కాస్త బిజీ అయ్యారు. తన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయని అభిమానులకు హామీ ఇచ్చారు. హిట్ 3 చిత్రానికి తానే నిర్మాతగా వ్యవహరించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది.


Click it and Unblock the Notifications











