Happy Birthday Nani: టాలీవుడ్‌లోనే అలా చేసిన మొదటి హీరో.. దానికి ఒప్పుకుని తప్పు చేసిన నాని

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. దాదాపు దశాబ్ధ కాలంగా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోన్న అతడు.. ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడు. తద్వారా మరెవరికీ సాధ్యం కాని రీతిలో విజయాలను అందుకున్నాడు. అంతేకాదు, చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటించి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక, బుధవారం 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు నాని. ఈ నేపథ్యంలో అతడి జీవితంలోని అత్యంత ముఖ్య ఘట్టాలు మీకోసం!

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అష్టాచమ్మా హీరో

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అష్టాచమ్మా హీరో

సినిమాల్లో నటించాలన్న లక్ష్యంతో చదువుకు మధ్యలోనే పుల్‌స్టాప్ పెట్టేశాడు నాని. ఈ క్రమంలోనే 'రాధా గోపాలం' అనే సినిమాకు బాపు దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఆ తర్వాత బడా డైరెక్టర్లు రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల సహా పలువురి దగ్గరా వర్క్ చేశాడు. ఈ క్రమంలోనే ఇంద్రగంటి మోమన్‌కృష్ణ తెరకెక్కించిన 'అష్టాచమ్మా' అనే సినిమాతో నాని హీరోగా పరిచయం అయ్యాడు.

మొదటి బ్రేక్ ఇచ్చింది ఆమె.. ఫుల్ బిజీగా

మొదటి బ్రేక్ ఇచ్చింది ఆమె.. ఫుల్ బిజీగా

'అష్టాచమ్మా' హిట్ అయినప్పటికీ నానికి మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే 'రైడ్‌', 'స్నేహితుడా', 'భీమిలీ కబడ్డీ జట్టు' వంటి సినిమాలు చేసి నటుడిగా పరిణితి సాధించాడు. సరిగ్గా అప్పుడే నందినీ రెడ్డి తెరకెక్కించిన 'అలా మొదలైంది'తో మొదటి బ్రేక్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత 'పిల్ల జమిందార్'తో నేచురల్ స్టార్‌గా బిరుదును దక్కించుకున్నాడీ టాలెంటెడ్ హీరో.

అదే నాని ప్రత్యేకత... తనకు తానే పోటీగా

అదే నాని ప్రత్యేకత... తనకు తానే పోటీగా

కథ ఏదైనా.. కంటెంట్ ఎలా ఉన్నా.. యాక్టింగ్‌లో మాత్రం అదరగొడుతుంటాడు నాని. నేచురల్ స్టార్ అనే బిరుదుకు సార్థకం చేస్తూ ఎన్నో సినిమాల్లో సహజసిద్ధమైన పాత్రలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రతి సినిమాను వన్ మ్యాన్ షోగా మారుస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ విషయంలో మాత్రం తనకు తానే పోటీ అనేటట్లుగా ఎదిగిపోయాడు నాని.

టాలీవుడ్‌లోనే అలా చేసిన మొదటి హీరో

టాలీవుడ్‌లోనే అలా చేసిన మొదటి హీరో

నాని కెరీర్‌లో 'ఈగ' ప్రత్యేకమైన సినిమా. దీనికి కారణం దీన్ని రాజమౌళి తెరకెక్కించడమే. ఈ మూవీతో అతడి స్టార్ ఇమేజ్‌కు కూడా బాగా పెరిగింది. ఈ కారణంగానే దీని తర్వాత అతడు చేసిన పలు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మారుతి తెరకెక్కించిన 'భలే భలే మగాడివోయ్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వరుసగా ఎనిమిది హిట్లు కొట్టాడు.

అది ఒప్పుకుని తప్పు చేసిన స్టార్ హీరో

అది ఒప్పుకుని తప్పు చేసిన స్టార్ హీరో

కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే నేచురల్ స్టార్ నాని.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో వివాదాల నడుమ ప్రసారం అయిన రెండో సీజన్‌ను అద్భుతంగా హోస్ట్ చేశాడు. అయినప్పటికీ నానిపై ఓ వర్గం విమర్శనాస్త్రాలు సంధించింది. దీంతో మరోసారి ఈ తరహా షోలు చేయనని అప్పుడే చెప్పేశాడతను. దీంతో తర్వాతి సీజన్లను నాగ్ హోస్ట్ చేస్తున్నాడు.

వరుస ఫ్లాప్‌లు.. ఒకేసారి 3 సినిమాలు

వరుస ఫ్లాప్‌లు.. ఒకేసారి 3 సినిమాలు

ఈ మధ్య కాలంలో నాని 'జెర్సీ' మినహా పెద్దగా హిట్లను సొంతం చేసుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 'టక్ జగదీష్', 'శ్యామ్ సింగరాయ్', 'అంటే.. సుందరానికీ' అనే సినిమాలు చేస్తున్నాడు. అలాగే, నిర్మాతగానూ కొన్ని సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇవన్నీ సూపర్ హిట్లు అవ్వాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే నేచురల్ స్టార్ నాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X