నవదీప్ మామూలోడు కాదు.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు!!
యంగ్ హీరో, విలక్షణ నటుడు, వెండితెర, బుల్లితెర, వెబ్ సిరీస్‌లు ఇలా ప్రతీ చోటా తన సత్తా చాటుతున్నాడు నవదీప్. ప్రస్తుతం అదిరింది షోలో దుమ్ములేపుతున్నాడు. ఇక బయట సోషల్ మీడియాలోనూ నవదీప్ వేసే కౌంటర్లు వైరల్ అవుతుంటాయి. ప్రకృతి, మూగజీవులు, వ్యాయామం అంటూ తన లోకంలో తానే ఉంటాడు. ప్రస్తుతం మాత్రం నవదీప్ తన శరీరాకృతిని మార్చుకునే పనిలో పడ్డాడు.
ఈ మధ్య నవదీప్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ పేరు రావడంతో టాలీవుడ్ పునాదులు కదులుతాయని అంతా భావించారు. అసలు రకుల్ పేరు రాలేదని అధికారులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో నవదీప్‌పై సోషల్ మీడియాలో సెటైర్స్ వేశారు. జాగ్రత్తగా ఉండన్నా అంటూ డ్రగ్స్ కేసును ఉద్దేశించి కామెంట్స్ చేశారు. పనికొచ్చే పనులు చేద్దాం అంటూ నవదీప్ కౌంటర్ వేశాడు.

తాజాగా నవదీప్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై సెటైర్ వేశారు. కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య పెంచారు కాబట్టి కరోనా కోసులు పెరుగుతున్నాయి.. అదే ఒక వేళ ఐక్యూ టెస్ట్‌లు చేస్తే ఇడియట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది అని కౌంటర్ వేశాడు. దీంతో ఒకే ట్వీట్‌కు రెండు దెబ్బలు పడ్డట్టైంది. ఇడియట్స్ ఎక్కువ మంది బయట పడతారని చెబుతూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని చెప్పకనే చెప్పాడు.


Click it and Unblock the Notifications











