twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త షోతో రెడీ.. నవదీప్‌లోని మరో కోణం

    |

    హీరోగా, విలన్‌గా నవదీప్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ప్రత్యేక పాత్రల్లో, సినిమాను మలుపు తిప్పే క్యారెక్టర్స్‌లోనూ ఎంతో అద్భుతంగా నటించాడు. ఇక వెబ్ సిరీస్‌లో అయితే నవదీప్ దూసుకుపోతున్నాడు. ఇక బుల్లితెరపైనా అదిరింది షోతో సెటైర్లు వేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అయితే తెర మీదే కాదు మమూలుగానే నవదీప్ సరదాగా ఉంటూ సెటైర్లు వేస్తుంటాడు. మొన్నామధ్య డ్రగ్స్ కేసులో రకుల్ పేరు వచ్చిన సంగతి తెలిసిందే.

    అలా రకుల్ పేరు రావడంతో నవదీప్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. జాగ్రత్తగా ఉండన్నా అంటూ డ్రగ్స్ కేసులో నవదీప్ ఉన్నాడేమో అని ఓ నెటిజన్ కామెంట్స్ చేశాడు. నాకేం బాధ లేదు పనికొచ్చే పనులు చేద్దాం అంటూ నవదీప్ కౌంటర్ వేశాడు. ఇక రీసెంట్‌గా కరోనా కేసులు టెస్టులను అడ్డుపెట్టుకుని మరో సెటైర్ వేశాడు. కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య పెంచారు కాబట్టి కరోనా కోసులు పెరుగుతున్నాయి.. అదే ఒక వేళ ఐక్యూ టెస్ట్‌లు చేస్తే ఇడియట్స్ సంఖ్య కూడా పెరుగుతుంది అని కౌంటర్ వేశాడు.

     Navdeep New Show Like No 1 Yaari

    తాజాగా నవదీప్ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో ఓ కొత్త షోను హోస్ట్‌ చేయబోతోన్నట్టు ప్రకటించాడు. ఈ సెలెబ్రేషన్స్‌లో సూపర్ స్టార్ అవసరం ఎవరికి ఉండదు. ఓ సూపర్ స్టార్ రాబోతోన్నాడు.. పొడుగ్గా సన్నగా అద్భుతంగా ఉంటాడు అంటూ పేర్కొన్నాడు. ఇది గతంలో రానా చేసిన నంబర్ వన్ యారీ లాంటి టాక్ షో అని తెలుస్తోంది. అయితే ఆ సూపర్ స్టార్ గెస్ట్ ఎవరో చూడాలి. తదుపరి వివరాల త్వరలోనే అందర్నీ సస్పెన్స్‌లో వదిలేశాడు.

    English summary
    Who doesn't want a superstar in their celebrations? A new superstar is coming with a rich taste, tall and sleek and with a premium blend. Watch out this space tomorrow for the unveiling of the new superstar in town.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X