Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ సాంగ్ వింటే మూడు బ్రేకప్స్ గుర్తుకు వచ్చాయట.. నవీన్ పొలిశెట్టి నిజంగా ‘జాతి రత్నం’!
ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి తన సినిమా జాతి రత్నాలు ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నవీన్ పొలిశెట్టి ముఖ్య పాత్రలు పోషించినా కూడా ప్రచారం బాధ్యతలను మాత్రం నవీన్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఎక్కడ చూసినా నవీన్ పొలిశెట్టి జాతిరత్నంగానే చెలరేగిపోతోన్నాడు. బుల్లితెరపై ప్రమోషన్స్ కార్యక్రమాల్లో నవీన్ ఇరగదీస్తున్నాడు.
క్యాష్ షోలో అలా..
క్యాష్ షోలో జాతి రత్నం టీం స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. నిర్మాత ప్రియాంక దత్, దర్శకుడు, నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ ఫరియాలు రచ్చ రచ్చ చేశారు. మరీ ముఖ్యంగా అందరికీ కంటే నవీన్, మూవీ డైరెక్టర్ అల్లరల్లరి చేసేశారు. ఇప్పుడు మరో షోలో జాతిరత్నం రచ్చ చేసేందుకు రెడీ అయింది.
ప్రమోషన్స్‌లో బిజీగా..
మామూలుగా సినిమా దగ్గర పడుతుందంటే.. అందరూ కూడా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటారు. అయితే జాతి రత్నం సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలున్నా కూడా ముందు నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. మార్చి 11న రాబోతోన్న జాతి రత్నాలు సినిమా కోసం నవీన్ మరింతగా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నాడు.
సరిగమప షోలో..
నవీన్ పొలిశెట్టి, ఫరియా ఇద్దరూ కూడా జీ తెలుగు సరిగమప షోలో గెస్ట్లుగా వచ్చేశారు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. అందులో నవీన్ అందరినీ ఓ ఆట ఆడుకున్నాడు. యాంకర్ ప్రదీప్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఇలా అందరికీ పంచ్‌ల మీద పంచ్‌లు వేశాడు.
పడిపోయాడు..
షోలో ఎంట్రీ ఇచ్చే సమయంలో నవీన్, ఫరియా ఇద్దరూ కలిసి డ్యాన్సులు వేశారు. చిట్టి అనే తమ సినిమాలోని పాటకే స్టెప్పులు వేశారు. అయితే నవీన్ రెండు బుగ్గలను ఫరియా పట్టుకోవడంతో నవీన్ ఒక్కసారిగా ఫిదా అయిపోయి కిందపడ్డాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు.
ఇద్దరికి పంచ్‌లు..
సరిగమప షో గురించి ఏదో తెలిసినట్టుగా, పాల్గొన్నట్టుగా చెబుతూ.. ఆ ఎపిసోడ్ చూశానంటూ చెప్పుకొచ్చాడు నవీన్. ఇక నువ్వే నువ్వే సినిమాలోని సముద్రమంతా అనే పాట వింటే మూడు బ్రేకప్పులు గుర్తుకు వచ్చాయంటూ కౌంటర్ వేశాడు. మిగతా మూడు అని ప్రదీప్ అంటే.. అవి వేరే పాటకు గుర్తొచ్చాయ్ అంటూ రివర్స్ కౌంటర్ వేశాడు. మొత్తానికి షోలో రచ్చ రచ్చ చేసి నిజంగానే జాతి రత్నం అనిపించుకున్నట్టున్నాడు.