ఏకాంతంగా ప్రియుడితో రొమాన్స్.. విఘ్నేశ్‌ను కౌగిలిలో బంధీ చేసిన నయన్
సౌత్ సూపర్ స్టార్ నయనతార తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్‌తో కలిసి భారీ స్థాయిలో రొమాన్స్ చేస్తోంది. ఈ ప్రేమ పక్షులపై ఎలాంటి రూమర్లు వచ్చినా సరే ఇద్దరూ మాత్రం ప్రేమమైకంలో ముగిని తేలుతుంటారు. నయన్ విఘ్నేశ్ ప్రేమకథ గత ఐదేళ్లుగా అక్కడే ఆగిపోయింది. ముందుకు కదిలి పెళ్లి పీటలెక్కడం లేదు. అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అంటూ రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిపై ఏనాడూ కూడా ఈ జంట స్పందించలేదు.

విడిపోయారంటూ..
ఆ మధ్య నయన్ విఘ్నేశ్ విడిపోయారంటూ మనస్పర్ధలు వచ్చాయంటూ వార్తలు వైరల్ అయ్యాయి. నయన్ ఒంటరిగా ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొనడం, వెంట విఘ్నేశ్ లేకపోవడంతో ఆ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని ఆ తరువాత ఓ కామెడీ వీడియోతో సమాధానం చెప్పారు.

గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్..
నయన తార తన తల్లి, ప్రియుడి బర్త్ డేను గోవాలో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఓనం పండుగ కోసం ఇంటికి వెళ్లిన నయన్, విఘ్నేశ్.. అటు నుంచి అటే గోవాకు వెళ్లారు. అక్కడే నయన్ తన తల్లి బర్త్ డేను, విఘ్నేశ్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఇక బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను ఊపేశాయి.

25 లక్షలు ఖర్చు..
చెన్నై నుంచి కొచ్చి.. కొచ్చి నుంచి గోవా.. గోవా నుంచి చెన్నై ఇలా అన్ని చోట్లకు స్పెషల్ ఫ్లైట్‌లోనే వెళ్లింది. బాయ్ ఫ్రెండ్ కోసం మొత్తం ఆ సమయంలో 25 లక్షలు ఖర్చు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా నయన్ మరోసారి సెలెబ్రేషన్స్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.

దీపావళి సెలెబ్రేషన్స్..
నయన్ విఘ్నేశ్ దీపావళి సెలెబ్రేషన్స్‌లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. కోయంబత్తూర్‌లో ప్రస్తుతం ఈ ఇద్దరూ ఓ హోటల్‌లో ఉన్నారని తెలుస్తోంది. హోటల్ రూంలో ఏకాంతంగా ఉన్న నయన్ విఘ్నేశ్ సోషల్ మీడియాలో మంట పెడుతున్నారు. ప్రియుడిని ఘాడంగా కౌగిలించుకుని ఒకరి కళ్లల్లో మరొకరు కళ్లు పెట్టి చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











