For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

  |

  సినీ రంగంలో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే పెళ్లి వరకూ చేరుకుని సుఖాంతం అవుతాయి. అలా చాలా తక్కువ జంటలే తమ బంధాన్ని మూడు ముళ్ల వరకూ తీసుకెళ్లగలిగారు. అందులో సుదీర్ఘ కాలం పాటు ప్రేమ పక్షుల్లా విహరించి, ఇటీవలే ఒక్కటైన లేడీ సూపర్ స్టార్ నయనతార.. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ జంట ఒకటి.

  ఇటీవలే అగ్నిసాక్షిగా ఒక్కటైన వీళ్లిద్దరూ.. ఎంతో గ్యాప్ తీసుకోకుండా తమ తమ కెరీర్‌లను పున: ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నయన్ - విఘ్నేష్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో వదిలారు. వాటిపై మీరూ లుక్కేయండి!

  దర్శకుడితో నయన్ ప్రేమాయణం

  దర్శకుడితో నయన్ ప్రేమాయణం


  హీరోయిన్‌గా నయనతార ఎంతో విజయవంతం అయింది. అందుకే ఆమెకే లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా దక్కింది. అయితే, ఈ అమ్మడు లవ్ ట్రాకుల విషయంలో పలుమార్లు విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో నయన్.. విఘ్నేష్ శివన్ అనే కోలీవుడ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాకును మొదలెట్టింది. నాలుగేళ్ల పాటు అతడితో బంధాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే.

  Karthikeya 2 Twitter Review: నిఖిల్ మూవీకి అలాంటి టాక్.. బాహుబలి తర్వాత ఇదే.. క్లైమాక్స్ మాత్రం!

   ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న జంట

  ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న జంట


  చాలా ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించిన నయనతార.. విఘ్నేష్ శివన్ జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న షెరటాన్ హోటల్‌‌‌లో పెళ్లి చేసుకున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. బీచ్ వ్యూ ఉండే ఈ హోటల్‌లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో వర్క్ జరిగింది. దీంతో ఈ సినీ జంట పెళ్లి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

  హనీమూన్‌లో తెగ ఎంజాయ్ చేసి

  హనీమూన్‌లో తెగ ఎంజాయ్ చేసి


  పెళ్లి చేసుకున్న తర్వాత నయనతార - విఘ్నేష్ శివన్ జోడీ ఇండియాలోని పలు దేవాలయాలను సందర్శించింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవాలయంలో చెప్పులతో వెళ్లిందని పెద్ద వివాదమే చెలరేగింది. ఆ తర్వాత ఈ జంట హనీమూన్‌కు చెక్కేసింది. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వీళ్లిద్దరూ తమ కొత్త జీవితాన్ని తెగ ఎంజాయ్ చేసి చాలా రోజులకు తిరిగి వచ్చారు.

  రష్మిక మందన్నా హాట్ సెల్ఫీ వైరల్: ఈ పిక్‌లో ఆమెను చూస్తే తట్టుకోలేరు

  కెరీర్లు రీస్టార్ట్... తీరిక లేకుండానే

  కెరీర్లు రీస్టార్ట్... తీరిక లేకుండానే


  పెళ్లైన తర్వాత నయనతార సినిమాలకు సుదీర్ఘ కాలం బ్రేక్ ఇస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఆమె వివాహం జరిగిన నెల వ్యవధిలోనే తన కెరీర్‌ను పున: ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు సినిమాల షూటింగ్‌లలో పాల్గొంది. అలాగే, విఘ్నేష్ శివన్ కూడా తన తదుపరి సినిమా ప్రొడక్షన్ వర్క్‌లను దగ్గరుండి పర్యవేక్షించాడు.

  బార్సీలోనా వెళ్లిన నయన్ - విక్కీ

  బార్సీలోనా వెళ్లిన నయన్ - విక్కీ


  వివాహం జరిగిన చాలా తక్కువ సమయంలోనే సినిమా పనుల్లో బిజీ అయిన నయనతార - విఘ్నేష్ శివన్.. ఖాళీ సమయాల్లో తమ వైవాహిక జీవితాన్ని చక్కగా గడుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పర్వదినాలను కుటుంబ సమేతంగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నయనతార.. విఘ్నేష్ శివన్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు పయనం అయ్యారు.

  బద్రీ హీరోయిన్ బాత్రూం వీడియో వైరల్: వామ్మో ఇది చూశారంటే షాకే!

  సోషల్ మీడియా ద్వారా ప్రకటన

  సోషల్ మీడియా ద్వారా ప్రకటన


  జంటగా గడుపుతోన్న మధుర క్షణాలను అటు నయనతార కానీ, ఇటు విఘ్నేష్ శివన్ కానీ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు వీళ్లిద్దరూ బార్సిలోనాకు పయనమైన విషయాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. తాజాగా విక్కీ 'వర్క్ వర్క్ వర్క్ కాకుండా మాకోసం కొంత సమయం' అంటూ చెప్పుకొచ్చాడు.

  రొమాంటిక్ పిక్స్ వదిలిన విఘ్నేష్

  రొమాంటిక్ పిక్స్ వదిలిన విఘ్నేష్


  విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతారతో కలిసి ప్లైట్‌లో బార్సీలోనా వెళ్తోన్న ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో నయన్ అతడి మీద కూర్చుని ఉంది. మరో పిక్‌లో విఘ్నేష్ ఆమెకు ముద్దు పెట్టాడు. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి తెగ వైరల్ అయిపోతోన్నాయి

  English summary
  Kollywood Newly Married Couple Nayanthara and Vignesh Shivan Went foreign Tour. Now Their Romantic Pic Gone Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X