ఎంతైనా నయనతార రేంజ్ వేరు.. ప్రియుడితో స్పెషల్ ఫ్లైట్‌లో రచ్చ.. అక్కడే మకాం!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార వ్యవహారం ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలే ట్రెండ్ అవుతుంటాయి. ఆమె ప్రేమ కథలు,బ్రేకప్, కొత్త ప్రియుడు ఇలా నయన్ జీవితంలో ఇలాంటి ఘటనలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే నయనతార తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. వీరి పెళ్లిపై వచ్చినన్నీ వార్తలు మరేతర సెలెబ్రిటీలపై వచ్చి ఉండవు.

అలా కథ మొదలు..
నయనతార హీరోయిన్‌గా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో వచ్చిన నానూ రౌడీదానే (నేనూ రౌడీనే) సినిమాతో ఈ ఇద్దరి కథ మొదలైంది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో విఘ్నేశ్ ప్రేమలో నయన్ పడిపోయింది. అలా వీరిద్దరి ప్రేమ కథ నేటికీ కొనసాగుతూనే ఉంది.

పెళ్లిపై రకరకాల కామెంట్లు..
నయన్ విఘ్నేశ్ పెళ్లి గురించి రకరకాల కామెంట్లు వినిపిస్తుంటాయి. త్వరలోనే పెళ్లి అంటూ కొన్ని సార్లు వార్తలు వినిపిస్తుంటాయి.. గుళ్లో పెళ్లి అంటూ మరికొన్ని సార్లు రూమర్లు వస్తుంటాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగిందంటూ ఇంకొన్ని సార్లు గాసిప్స్ వస్తుంటాయి.

తాజాగా అలా..
మొన్నీ మధ్య నయన్ విఘ్నేశ్ శివన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో నయన్ వేలికి ఉంగరం ఉంది. అది ఫోకస్ అయ్యేలా ఓ ఫోటో బయటకు రావడంతో అందరూ నిశ్చితార్థం అయిందని వార్తలు రాసేశారు. తాజాగా మరోసారి ఈ ఇద్దరి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.

కొచ్చికి జంప్..
మామూలుగా అయితే నయన్ తన అమ్మ దగ్గరికి వెళ్తున్న ప్రతీసారి కూడా విఘ్నేశ్‌ను వెంట తీసుకుని వెళ్తుంటుంది. అలా చెన్నై నుంచి కొచ్చికి వెళ్లే ప్రతీ సారి కూడా స్పెషల్ ఫ్లైట్‌లోనే వెళ్తుంటుంది. అయితే తాజాగా కూడా ఈ జంట కొచ్చికి మకాం మార్చేసింది.

విఘ్నేశ్ అలా..
తాజాగా విఘ్నేశ్ శివన్ ఓ ఫోటోను షేర్ చేశాడు. అంతే కాకుండా తన ఇన్ స్టా స్టోరీలో ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో నయన్ తన ఫోన్‌తో బిజీగా ఉంది. ఫ్లైట్ టేకాఫ్ అవుతోంది జాగ్రత్త అంటూ సెటైర్ వేశాడు. అందులోనే కొచ్చికి వెళ్తున్నట్టు తెలిపాడు. అయితే కొచ్చికి ఎందుకు వెళ్లున్నారనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications











