Chiranjeevi: ఏంటి బ్రో... ఈ హీరోయిన్స్ అందరూ చిరంజీవికే ఎందుకు హ్యాండ్ ఇస్తున్నారు?
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడమే ఓ అదృష్టంగా భావిస్తారు. ఆయనతో కలిసి నటించాలని ప్రతి నటి, నటుడు పరితపిస్తారు. ఒక్కసారైనా ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి.. హీరోయిన్స్ వరుసగా హ్యాండ్ ఇస్తున్నారు. చిరంజీవికి హీరోయిన్స్ హ్యాండ్ ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిరంజీవి సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్స్... ఎందుకో మెగాస్టార్ కు హ్యాండ్ ఇస్తున్నారు. ఎందుకో ఆయనకు, అందులో నటిస్తున్న హీరోయిన్స్ మధ్య గ్యాప్ వస్తోంది. ఆయన గత సినిమాలను పరిశీలిస్తే... చిరు రీ ఎంట్రీ చేసిన సినిమాలు ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య.. ఇప్పుడు భోళా శంకర్. అయితే ఈ సినిమాల్లో నటించిన ఏ హీరోయిన్.. చిరుతో కలిసి ప్రీరిలీజ్ ఈవెంటులో కనిపించలేదు.

ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంటుకు కాజల్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆమె సీన్స్ ను ఆ సినిమాలో లేపేసి.. అవుట్ పుట్ ఆమె ట్రాక్ మొత్తం లేపేశారు. దీనితో ఆమె ఆ సినిమా హీరోయిన్ కానట్టే. సో అందుకు రాలేదు అనుకుందాం. ఇక సైరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంటుకు నయనతార రాలేదు. ఆమె ఎలాగూ రాదు. ఎందుకంటే.. ముందే ఒప్పందం కుదుర్చుకుంటుంది. ముందుగానే నేను సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనను అంటూ నయన్ ప్రతి సినిమాకు ఒప్పందం కుదుర్చుకుంటుంది.

ఇక శృతి హాసన్ విషయానికి వస్తే.. చిరు సినిమా ప్రీరిలీజ్ ఈవెంటుకు హ్యాండ్ ఇచ్చింది. శృతి హాసన్ వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంటుకు రాలేదు కానీ... అదే సమయంలో రిలీజ్ అవుతున్న బాలయ్య వీరసింహారెడ్డి సినిమా ప్రీరిలీజ్ ఈవెంటుకు వెళ్లింది. దీనితో చిరుకు కావాలనే హ్యాండ్ ఇచ్చిందా అనే అనుమానాలు వచ్చాయి. బాలయ్యకు ఇచ్చిన ఇంపార్టెన్స్.. చిరుకు ఎందుకు ఇవ్వలేదని అప్పట్లో కామెంట్స్ కూడా వచ్చాయి.

అయితే శృతి హాసన్ వెళ్లకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉందట. వాల్తేరు వీరయ్య సినిమా పాట కోసం టీమ్ అంతా కూడా స్విట్జర్లాండ్ వెళ్లారు. బాలయ్య ఈవెంట్‌కు వెళ్లిన శ్రుతి హాసన్.. ఆ మరుసటి రోజే పెట్టిన వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈవెంట్‌కు వెళ్లలేదనే కామెంట్స్ వచ్చాయి.

ఇప్పుడు మరో హీరోయిన్ తమన్నా కూడా చిరుకు హ్యాండ్ ఇచ్చింది. నిన్న జరిగిన భోళా శంకర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు తమన్నా డుమ్మా కొట్టింది. మొన్నటి వరకు ఇక్కడే ఉందని కూడా చిరంజీవి స్టేజ్ మీద చెప్పి... మెచ్చుకున్నాడు. కానీ తమన్నా మాత్రం ఇక్కడ చిరంజీవి సినిమాకు మాత్రం రాలేదు కానీ.. మొన్న జరిగిన జైలర్ ప్రీరిలీజ్ ఈవెంటుకు వెళ్లి సందడి చేసింది. చెల్లెలి పాత్రలో నటించిన కీర్తి సురేష్ వచ్చింది కానీ... చెలిగా నటించిన తమన్నా మాత్రం రాలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి చిరు ప్రతి సినిమాకు హీరోయిన్స్ హ్యాండ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











