నయనతార సీక్రెట్ లీక్ చేసిన ప్రియుడు... అందుకే పెళ్లి చేసుకోవట్లేదంటూ కామెంట్.!
అద్భుతమైన టాలెంట్‌తో దక్షిణాదిలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది నయనతార. సినిమాల పరంగా ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న ఆమె... వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలతో సతమతం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మరో సినీ ప్రముఖుడితో ప్రేమాయణం సాగిస్తూ హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో నయనతారకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ లీక్ చేశాడు ఆమె ప్రియుడు. అంతేకాదు, పెళ్లి విషయంపైనా క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం.!

ఎక్కడ చూసినా నయనతారే కనిపిస్తోంది
కర్నాటకకు చెందిన నయనతార.. మాతృభాషలో కాకుండా మలయాళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఇక, విక్టరీ వెంకటేష్ నటించిన ‘లక్ష్మీ' అనే మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కన్నడంలోనూ సినిమాలు చేసింది. ఇలా.. దక్షిణాదిలోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోందీ అమ్మడు.

లేడీ సూపర్ స్టార్... ఏకైక దక్షిణాది భామ
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దక్షిణాదిలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా పేరొందింది నయనతార. అదే సమయంలో లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును సైతం అందుకుంది. అంతేకాదు, భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటూ రికార్డు క్రియేట్ చేసింది. ఇక, ఫోర్బ్స్ 2018 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక హీరోయిన్‌గా నిలిచింది.

ప్రేమ వ్యవహారాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్
సినిమాల పరంగా సూపర్ ఫామ్‌లో కొనసాగుతోంది నయనతార. అయితే, పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉంది. గతంలో ఓ హీరోతో ప్రేమాయణం సాగించిన ఆమె.. అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత ప్రభుదేవాతో పెళ్లి పీటల వరకు వెళ్లి నిర్ణయం మార్చుకుంది. దీంతో ఫ్లాప్ లవ్ స్టోరీలతో నయనతార దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

యంగ్ డైరెక్టర్‌తో ప్రేమ.. రివీల్ చేసేసింది
వ్యక్తిగత జీవితం ఏమంత ఆశాజనకంగా లేకపోయినా... ‘నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా షూటింగ్ సమయంలో నయనతార యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమలో పడింది. అప్పటి నుంచి చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపింది. ఆ తర్వాత ఈ విషయం బహీర్గతం అవడంతో... తన ప్రేమ గురించి లేడీ సూపర్ స్టార్ నయన్ అధికారికంగా ప్రకటన చేసింది.

ప్రియుడితో కలిసి పూజలు.. అందుకేనా
చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు నయనతార - విఘ్నేష్ శివన్. ఈ క్రమంలోనే హాలీడే ట్రిప్పులు ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో దైవ దర్శనాలు సైతం చేస్తున్నారు. ఇక, ఈ మధ్య ఈ సినీ జంట చాలా గుళ్లనే దర్శించుకుంది. అంతేకాదు, అక్కడ జంటగా ప్రత్యేకమైన పూజలు చేసింది. దీంతో విడిపోకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది.

నయనతార సీక్రెట్ లీక్ చేసిన ప్రియుడు
కొద్ది రోజులుగా నయనతార పెళ్లి గురించి ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తన ప్రియుడు విఘ్నేష్‌ను వివాహం చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ చిన్న ఆలయంలో దండలు మార్చుకోబోతున్నారని కూడా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నయనతార గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు విఘ్నేష్.
Recommended Video

అందుకే పెళ్లి చేసుకోవట్లేదంటూ కామెంట్.!
తాజాగా జరిగిన ఓ చిట్‌చాట్‌లో విఘ్నేష్ ‘మేము పెళ్లి చేసుకోబోతున్నామన్న వార్తల్లో నిజం లేదు. నయన్‌కు పెళ్లి కంటే ముఖ్యమైన గోల్స్ ఉన్నాయి. అవి రీచ్ అయిన తర్వాతనే దాని గురించి ఆలోచిస్తాం. ప్రియుడిగా ఆమె నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది. అలాగే, నాకు కూడా కొన్ని కలలు ఉన్నాయి. అవి కూడా జరగాలి' అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











